Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో సర్కారు వారి పాట.. కానీ..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

Sarkaru Vaari Paata: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓటీటీలో సర్కారు వారి పాట.. కానీ..
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 02, 2022 | 3:06 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata). పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. మహేష్ లో మాస్ యాంగిల్ చూసి ప్రేక్షకుల ఫిదా అయిపోయారు. మహేష్ కు జోడీగా అందాల భామ కీర్తిసురేష్ నటించిన ఈ సినిమాను మైత్రి మూవీస్ , మహేష్ బాబు జీ.ఎమ్.బీ బ్యానర్స్ కలిసి నిర్మించాయి. ఇక ఈ సినిమా మహేష్ కెరీర్ ఓ మరో మైల్ స్టోన్ గా నిలిచింది. సూపర్ హిట్ సొంతం చేసుకోవడమే కాకుండా రికార్డ్ స్థాయిలో వసూళ్లను కూడా రాబట్టింది. ఇక ఈ సినిమాకు తమన్ అద్భుతమైన పాటలను అందించారు. సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట..! ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన పాట..! 200 కోట్ల క్లబ్‌లోకి వెళ్లిన పాట..! ఘట్టమనేని అభిమానుల్ని గల్లలెగరేసేలా చేసిన పాట..! ఇప్పుడీ పాటకు తమన్ స్వరపరిచిన మరో పాట యాడ్ అయిపోయింది. ఎప్పటి నుంచో అభిమానులు ఆతురతగా వెయిట్ చేస్తున్న.. ఆరాట పడుతున్న ‘మురారి వా ‘ పాట తాజాగా యాడ్ అయిపోంది.  ఇక ఇప్పుడు మహేష్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది.

సర్కారు వారి పాట ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ రేటుకి సర్కారు వారి పాటను దక్కించుకుంది. నెల రోజుల థియేట్రికల్ రన్ తర్వాత అంటే జూన్ 10 లేదా జూన్ 24న ఓటీటీ రిలీజ్ చేసే అవకాశం ఉందని మొదట టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే ముందుగానే ఈరోజు నుంచే ప్రైమ్ వీడియో మహేశ్ సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చింది. పే పర్ వ్యూ రెంటల్ విధానంలోమహేష్ మూవీని అభిమానులకు అందించింది అమెజాన్ ప్రైమ్. కొద్దిరోజులు పే పర్ వ్యూ విధానంలో ఉంచి.. ఆతర్వాత సాధారణ యూజర్లకు అందుబాటులో ఉంచనుంది. దాంతో మహేష్ అభిమానులు ఖుష్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి