Kamal Haasan: ఆ హీరోకి ఫోన్ చేసి అడగ్గానే ఒప్పుకున్నాడు.. ఇంట్రస్టింగ్ విషయం చెప్పిన కమల్
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన విక్రమ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది . స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే మరో కీలక పాత్రలో స్టార్ హీరో సూర్య కూడా కనిపించనున్నారు. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి బ్యానర్ ‘శ్రేష్ఠ్ మూవీస్’ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేస్తుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. జూన్ 3న ‘విక్రమ్’ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమౌతుంది. ఈ సందర్భంగా మీడియాతో ‘విక్రమ్’ చిత్రం విశేషాలు పంచుకున్నారు కమల్ హాసన్.
సూపర్ స్టార్ రజనీకాంత్ నేను తరచుగా కలుస్తూనే వుంటాం. గత నలభై ఏళ్లుగా ఇది జరుగుతూనే వుంది. మా సినిమాలు గురించి, స్నేహితుల గురించి సరదాగా మాట్లాడుకుంటాం. ‘విక్రమ్ సినిమాకి చాలా మంచి వైబ్రేషన్స్ వున్నాయి, కంగ్రాట్యులేషన్స్ ” అని రజనీ చెప్పారు అన్నారు కమల్. డ్రగ్స్ కానీ మరొకటి కానీ.. మనిషిని వేటాడే జంతువులా మారిపోయాడు మనిషి. అనుకోకుండా ఇలాంటి అడవిలో మనమంతా బాగస్వాములుగా వున్నాం. విలన్ అనే వాడు మార్స్ నుండి దిగిరాడు. విక్రమ్ కథలో ఇలాంటి అంశాలాన్నీ చూడబోతున్నాం. ఇందులో ప్రతి పాత్రకు రెండు కోణాలు వుంటాయి. విక్రమ్ డార్క్ మూవీ. దర్శకుడు లోకేష్ కనకరాజ్ అద్భుతంగా తీశారు. విక్రమ్ గ్రేట్ థియేటర్ ఎక్స్ పిరియన్స్ వున్న సినిమా. అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి అన్నారు. మెజీషియన్ తన టోపీ నుంచి రాబిట్ తీస్తాడు. ఇది అసంభవమని మనకి తెలుసు. కానీ అది ఎలా తీశాడో మెజీషియన్ చెప్పడు. ఈ సినిమాలో విక్రమ్ ఎవరో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హీరో నితిన్, వారి నాన్న గారు సుధాకర్ రెడ్డి గారికి సినిమాపై ప్యాషన్ వుంది. ఆయన ‘విక్రమ్’ ని దాదాపు 400పైగా థియేటర్స్ లో భారీ విడుదల చేయడం ఆనందంగా వుంది.
మంచి సినిమా తీస్తే ఆడదనే నమ్మకం డిస్ట్రిబ్యూటర్స్ కి వుంది. అలా కాదని నిరూపించడానికి కాస్త ధైర్యం కావాలి. అంత ధైర్యం వున్న బాలచందర్, విన్సెంట్ మాస్టర్ లాంటి వాళ్ళు చాలా తక్కువ. నా సినిమాల్లో అన్ని పాత్రలకు ప్రాధాన్యత వుంటుంది. నా సినిమాల విషయానికి వస్తే నన్ను నేను ఎప్పుడూ స్టార్ అనుకోను. నేను ఒక ఆర్టిస్ట్ ని. కానీ అభిమానులు ప్రేమతో స్టార్ అని పిలుస్తారు. కానీ లోపల నేనెప్పుడూ ఒక కళాకారుడినే. కళాకారుడికి నాటకం ముఖ్యం. నేను స్వయంగా రాసిన చిత్రాలలో కూడా పవర్ ఫుల్ పాత్రలు రాశాను. నా చిత్రాలతో చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు. హీరోలయ్యారు. పోతురాజు సినిమాలో పశుపతి, అన్బే శివంలో మాధవన్ పాత్రలు ఎంతో బలమైనవి అన్నారు. ఇక విక్రమ్ సినిమాలో సూర్య స్పెషల్ ఎప్పిరియన్స్ లో కనిపిస్తారు. విక్రమ్ స్పెషల్ రోల్ గురించి కలసి మాట్లాడదామని ఫోన్ చేశా. కానీ ఫోన్ కాల్ లోనే అంతా అయిపొయింది. ”నేను చేస్తా అన్నయ్యా” అన్నారు. నేను వెళ్ళేటప్పటికి మొత్తం అయిపొయింది. మా బ్యానర్ లో సూర్యతో సినిమా చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నాం. చర్చలు నడుస్తున్నాయి. ఈ లోగా విక్రమ్ లో స్పెషల్ ఎప్పిరియన్స్ రోల్ చేశారు. ఐతే సూర్యతో తప్పకుండా సినిమా చేస్తాం. దాదాపు ఐదుగురు దర్శకులతో మాట్లాడాం అన్నారు. తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అన్న ప్రశ్నకు బదులిస్తూ.. నాకూ చేయాలనే వుంది. నేరుగా తెలుగులో సినిమా చేసి చాలా కాలమైయింది. దీని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.