Mass Maharaj Ravi Teja: మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహా రాజ్

మాస్ మహారాజ రవితేజ మంచి జోష్ మీద ఉన్నారు. చాలా కాలాంతర్వత క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు.

Mass Maharaj Ravi Teja: మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహా రాజ్
Ravi Teja
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Apr 25, 2021 | 8:57 AM

Mass Maharaj Ravi Teja : మాస్ మహారాజ రవితేజ మంచి జోష్ మీద ఉన్నారు. చాలా కాలాంతర్వత క్రాక్ సినిమాతో ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఇప్పటికే ఖిలాడీగా రావడానికి సిద్దమైన ఈ హీరో..మరి కొంతమంది దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ బిజీ కానున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు రవితేజ ఈ సినిమా షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు విపరీతమైన స్పందన వస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాతర్వాత త్రినాద్ రావ్ నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా చేసాయబోతున్నాడు రవితేజ ఈ సినిమా  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది. అలాగే శరత్ మండవ డైరెక్షన్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు రవితేజ . అయితే మాస్ రాజా మారుతి దర్శకత్వంలోను ఓ సినిమా చేయబోతున్నాడని ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఈ సినిమా సినిమాపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.

మంచు లక్ష్మీ – అడివి శేష్ కాంబినేషన్లో ‘దొంగాట’ సినిమాను తెరకెక్కించిన వంశీ కృష్ణ, ఇటీవల రవితేజను కలిసి ఒక కథను వినిపించాడట. కథ నాచడంతోపాటు ..ఇంతవరకూ తాను చేయని జోనర్ కావడంతో రవితేజ చాలా ఆసక్తిని చూపించాడట. తప్పకుండా చేద్దామనీ .. పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి చెప్పమని అన్నాడట.దాంతో వంశీ కృష్ణ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో పడినట్టు తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anupama: త‌న‌ విస్కీ బేబీకి నాలుగేళ్లు నిండిన సంద‌ర్భంగా.. ఎమోష‌న‌ల్ పోస్ట్ చేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌..

కరోనా నుంచి కోలుకున్న రియల్ హీరో.. నెగిటివ్ అంటూ పాజిటివ్‏ షేడ్‏లో చెప్పిన సోనూ సూద్..

Hari Teja: పెళ్లి రోజున త‌న చిన్నారిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన హ‌రితేజ‌.. భ‌ర్త‌, కూతురుతో క‌లిసి దిగిన‌..