Hari Teja: పెళ్లి రోజున తన చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేసిన హరితేజ.. భర్త, కూతురుతో కలిసి దిగిన..
Hari Teja: బుల్లి తెర నటిగా కెరీర్ మొదలు పెట్టి అనతికాలంలో నటిగా మంచి పేరు సంపాదిచుకుంది యాంకర్, నటి హరితేజ. ఇక 2017లో ప్రసారమైన బిగ్‌బాస్ తొలి ఎడిషన్ ద్వారా ప్రేక్షకులకు...
Hari Teja: బుల్లి తెర నటిగా కెరీర్ మొదలు పెట్టి అనతికాలంలో నటిగా మంచి పేరు సంపాదిచుకుంది యాంకర్, నటి హరితేజ. ఇక 2017లో ప్రసారమైన బిగ్‌బాస్ తొలి ఎడిషన్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన హరితేజ.. హౌజ్‌లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అ..ఆ” సినిమా ద్వారా సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందీ అందాల తార. ఇక ఆపై వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకెళుతోంది. ఇదిలా ఉంటే హరితేజ ఇటీవల ఓ పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని హరితేజ తన అభిమానులకు తెలియజేసింది. అయితే ఇప్పటి వరకు చిన్నారిని మాత్రం ప్రపంచానికి చూపించలేదు. ఈ క్రమంలోనే తాజాగా హరితేజ పెళ్లిరోజు సందర్భంగా తమ కూతురి ఫొటోను అభిమానులతో పంచుకుంది. భర్త దీపక్‌తో కలిసి చిన్నారిని ఎత్తుకున్న సమయంలో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హరితేజ.. “నువ్వు (చిన్నారిని ఉద్దేశిస్తూ) ఈ పెళ్లి రోజును మరింత ప్రత్యేకంగా, గుర్తుండిపోయేలా మార్చావు. పెళ్లి రోజు శుబాకాంక్షలు దీపు..” అంటూ అందమైన క్యాప్షన్‌ను జోడించింది. హరితేజ, దీపక్‌లు 2015లో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట ఏప్రిల్ 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
హరితేజ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో..
View this post on Instagram
India Coronavirus: కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2,624 మంది మృతి.. కేసులు..