AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhamaka: మాస్‌ మహరాజా మాస్‌ స్టెప్పులు.. శ్రీలీల అందచందాలు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న దండ కడియాల్‌

ఇప్పటికే ఈ చిత్రంలో చార్ట్‌బస్టర్ ఫోక్ నంబర్ గా జింతాక్‌ పాట నిలిచింది. ఇది దాదాపు 40 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. దండకడియాల్ సినిమాలోని మరో సెన్సేషనల్ సాంగ్ కానుంది. ఈ ఊర మాస్ ఫోక్ నెంబర్ ని భీమ్స్ స్కోర్ చేసి పాడటమే కాకుండా సాహిత్యం కూడా రాశారు.

Dhamaka: మాస్‌ మహరాజా మాస్‌ స్టెప్పులు.. శ్రీలీల అందచందాలు.. యూట్యూబ్‌ను షేక్‌ చేస్తోన్న దండ కడియాల్‌
Ravi Teja,sreeleela
Basha Shek
|

Updated on: Dec 08, 2022 | 9:09 PM

Share

మాస్ మహారాజా రవితేజ , త్రినాథరావు నక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్ ధమాకా సినిమా విడుదలకు ముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో విభిన్న ట్యూన్‌ లతో కూడిన ఆల్బమ్‌ ను స్కోర్ చేశాడు. ఆల్బమ్‌ లో క్లాస్, మాస్ బీట్స్ ఉన్నాయి. ఈ రోజు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐదవ పాట ‘దండ కడియాల్‌ ‘ను విడుదల చేశారు. ఈ పాటతో భీమ్స్ సిసిరోలియో మాస్ , ఫోక్ నెంబర్స్ ని కంపోజ్ చేయడంలో తన మార్క్ ని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో చార్ట్‌బస్టర్ ఫోక్ నంబర్ గా జింతాక్‌ పాట నిలిచింది. ఇది దాదాపు 40 మిలియన్ల వ్యూస్ ని సాధించింది. దండకడియాల్ సినిమాలోని మరో సెన్సేషనల్ సాంగ్ కానుంది. ఈ ఊర మాస్ ఫోక్ నెంబర్ ని భీమ్స్ స్కోర్ చేసి పాడటమే కాకుండా సాహిత్యం కూడా రాశారు. అతనితో పాటు సాహితీ చాగంటి, మంగ్లీ ఈ పాటను ఉత్సాహంగా పాడారు. విజువల్స్ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. రవితేజ డ్యాన్స్‌లు కన్నుల పండువగా ఉన్నాయి, ఇందులో శ్రీలీల రవితేజ గ్రేస్, ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ప్రయత్నించింది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. డిసెంబర్ 23న ‘ధమాకా’ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..