Rashmika Mandanna : ‘సామి సామి’ పాటకు గర్బా డాన్స్ అదరగొట్టిన యువకులు.. ఫిదా అయిన శ్రీవల్లి.. వీడియో వైరల్..
ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉండగా.. త్వరలోనే రష్మిక సైతం షూటింగ్లో జాయిన్ కానుంది. ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది నేషనల్ క్రష్.
డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప (Pushpa) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించగా.. అతని ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపించింది. ఇందులో బన్నీ మేకోవర్.. యాటీట్యూడ్కు ప్రేక్షకులే కాదు… సెలబ్రెటీలు సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమాలోని పుష్పరాజ్ సిగ్నెచర్ స్టెప్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిన విషయమే. ఇక ఈ మూవీలోని సాంగ్స్ సైతం సోషల్ మీడియాను షేక్ చేశాయి. భాషతో సంబంధం లేకుండా మిలియన్ వ్యూస్‍తో దూసుకుపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా పుష్ప పాటలకు స్టెప్పులేశారు. ఇటీవలే ఓ చిన్నారి సామి సామి పాటకు అద్బుతంగా డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుజరాతీలోని కొందరు యువకులు సామి సామి పాటకు గర్బా స్టెప్పులేసి అదుర్స్ అనిపించారు. దసరా సందర్భంగా గుజరాతీలో నవరాత్రి ఉత్సవాల్లో గర్బా చేస్తుంటారు.
ఇందులో భాగంగా.. ఇటీవల కొందరు యువకులు సామి సామి పాటకు గర్బా డాన్స్ చేస్తూ.. హుక్ స్టెప్ వేస్తూ అదుర్స్ అనిపించుకున్నారు. తాజాగా ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఇది చూసిన రష్మిక.. క్రేజీ అంటూ ఎమోజీలను జత చేసింది. ఇక ఇటీవల రష్మిక సైతం గుడ్ బై సినిమా ప్రమోషన్లలో భాగంగా మామ్స్ 3 ప్రోగ్రామ్లో పాల్గొన్న రష్మిక బాలీవుడ్ నటుడు గోవిందాతో కలిసి సామి సామి పాటకు స్టెప్పులేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉండగా.. త్వరలోనే రష్మిక సైతం షూటింగ్లో జాయిన్ కానుంది. ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంది నేషనల్ క్రష్.
@alluarjun @iamRashmika In this navratri gujrat people blockbuster movie pushpa song balam saami saami garba style in popular now me sala jukega nahi ???? pic.twitter.com/T7ge0YAa3l
— shailesh modi (@sbmodi010) September 14, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.