Rashmika Mandanna : ‘నాపై ఆడియన్స్‌కు కోపం వస్తుంది.. కానీ’.. రష్మిక ఆసక్తికర కామెంట్స్
అందాల భామ రష్మిక ప్రస్తుతం తెలుగు తమిళ్, హిందీ , కన్నడ భాషల్లో సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ అమ్మడి చేతిలో ఇప్పటికే అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి.
అందాల భామ రష్మిక(Rashmika Mandanna)ప్రస్తుతం తెలుగు తమిళ్, హిందీ , కన్నడ భాషల్లో సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ అమ్మడి చేతిలో ఇప్పటికే అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో సీతారామం సినిమా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తోంది. సీతారామం సినిమాలో అఫ్రిన్ అనే కాశ్మీర్ యువతి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ రష్మిక మాట్లాడుతూ..
అఫ్రిన్ లాంటి వైలెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో నాకు ఇచ్చారు.. ఈ పాత్రకు ఎలా న్యాయం చేయాలని దర్శకుడు హను గారిని అడిగాను. ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ నా పాత్రకు న్యాయం చేశానని పిస్తుంది అన్నారు రష్మిక. ఒక అందమైన ప్రేమ కథ చెప్పాడానికి కథకుడు వుండాలి. కథ ఎలా జరిగిందో వివరంగా చెప్పాలి కదా.. ఇందులో ఆ వివరాలని నేను ఇస్తా. సీత రామ్ అందమైన ప్రేమ కథని అఫ్రిన్ చెప్పే విధానం మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆగస్ట్ 5కోసం ఎదురుచూస్తున్నాను” అన్నారు. అలాగే అఫ్రిన్ ఒక రెబల్ పాత్ర. నా వల్ల ఎలా అవుతుందని హనుగారిని అడిగాను. నేను యాంగ్రీ బర్డ్ గా వుంటాను కానీ అందులో కూడా అమాయకత్వం వుంటుంది. కానీ అఫ్రీన్ పూర్తిగా రెబల్ రోల్. ఐతే ఇది అద్భుతమైన ప్రేమ. ఇందులో నా పాత్ర రామ్ సీతల ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. ఇది నాకు చాలా కొత్త పాత్ర. నా పాత్ర పై ఆడియన్స్ కి కోపం వచ్చి నా ఎమోషన్స్ తోటి కనెక్ట్ అయితే నేను విన్నర్ అయినట్లే అంటూ చెప్పుకొచ్చింది అందాల రష్మిక
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి