Nithya Menen: ఆ కారణంగానే యాక్టింగ్‏కు బ్రేక్ ఇస్తున్నా.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన నిత్యా మీనన్..

నేను పెళ్లి చేసుకోవడం లేదు. అది పెద్ద కథ మాత్రమే. ఈ కథలో ఎవరు లేరు. ఇంకా ఐదు ఆరు ప్రాజెక్ట్స్ రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ఇది పెద్ద శుభవార్తే.

Nithya Menen: ఆ కారణంగానే యాక్టింగ్‏కు బ్రేక్ ఇస్తున్నా.. ఫ్యాన్స్‏కు షాకిచ్చిన నిత్యా మీనన్..
Nithya Menon
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2022 | 7:46 PM

అలా మొదలైంది తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మలయాళ బ్యూటీ నిత్యా మీనన్ (Nithya Menen). మొదటి సినిమాతోనే యూత్‏లో యమ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ చిన్నది ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, సెగ, స్కైలాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నిత్యా చివరిగా పవన్ సరసన్ భీమ్లా నాయక్ మూవీలో కనిపించింది. అలాగే ఇటీవల మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్‏లోనూ నటించింది. తాజాగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తూ అభిమానులకు షాకిచ్చింది నిత్యా మీనన్. తాను యాక్టింగ్‏కు బ్రేక్ ఇస్తున్నానని.. అందుకు కారణం పెళ్లి మాత్రం కాదని చెప్పుకొచ్చింది.

ఆ వీడియోలో నిత్యా మాట్లాడుతూ.. “నేను పెళ్లి చేసుకోవడం లేదు. అది పెద్ద కథ మాత్రమే. ఈ కథలో ఎవరు లేరు. ఇంకా ఐదు ఆరు ప్రాజెక్ట్స్ రిలీజ్ కావాల్సి ఉన్నాయి. ఇది పెద్ద శుభవార్తే. నేను ఇప్పటివరకు కష్టపడి పనిచేస్తున్నాను. కాబట్టి నాకు కాస్త విరామం కావాలి. ఎందుకంటే నా కాలు నొప్పి కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడే పనిచేయం ప్రారంభించాను. ఇప్పుడే నా పాదాలపై లేవడం మొదలు పెట్టాను. సరైన సమయంలో నా ప్రాజెక్ట్స్ అన్నింటిని పూర్తిచేయగలిగాను. నేను కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్లీ నటిస్తాను. నా పెళ్లికి సంబంధించిన కాల్స్ రావని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వార్తలు వాస్తవం కాదు. కేవలం అది పెద్ద స్టోరీ మాత్రమే. అలాగే ఆ కథలో ఎవరు లేరు. నేను బ్రేక్ తీసుకుంటున్నది కేవలం నాకు రెస్ట్ కావాలని మాత్రమే. అంతేకానీ పెళ్లి కోసం మాత్రం కాదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవలే నిత్యా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడల్ షోలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?