- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun new look from pushpa 2 photos Telugu Entertainment News
Allu Arjun: పుష్పరాజ్ హింట్ ఇస్తున్నారా.? మాకు అర్థమయ్యిందంటున్న ఫ్యాన్స్..!
Allu Arjun: పుష్ప సక్సెస్‌తో బన్నీ రేంజ్ స్కై హైకి చేరింది. పుష్ప 2 మీద అంచనాలు కూడా అదే రేంజ్‌లో పెరిగిపోయాయి. దీంతో బన్నీకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ ఇన్‌స్టాంట్‌గా వైరల్ అవుతోంది.
Updated on: Jul 26, 2022 | 6:37 PM

పుష్ప సక్సెస్‌తో బన్నీ రేంజ్ స్కై హైకి చేరింది. పుష్ప 2 మీద అంచనాలు కూడా అదే రేంజ్‌లో పెరిగిపోయాయి.

దీంతో బన్నీకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్ ఇన్‌స్టాంట్‌గా వైరల్ అవుతోంది. తాజాగా అల్లు అర్జున్ స్టైలిష్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇప్పుడు ఈ ఫోటో గురించి ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది.పుష్ప సినిమాలో ఊర మాస్ లుక్‌లో అదరగొట్టిన అల్లు అర్జున్...

పుష్ప 2లో ఎలా కనిపించబోతున్నారన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ప్రజెంట్ ఈ మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలోనే ఉన్నారు ఐకాన్ స్టార్.

ఇదే సమయంలో బన్నీ స్టైలిష్ ఫోటో వైరల్ కావటంతో ఈ లుక్‌లోనూ పుష్ప 2లో నటిస్తున్నారా అన్న డిస్కషన్ జరుగుతోంది.

పుష్ప క్లైమాక్స్‌లో స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు కింగ్ అయ్యారు బన్నీ. సో... సీక్వెల్‌లో బన్నీ క్యారెక్టర్ రిచ్ లుక్‌లోనే కనిపిస్తుందన్న క్లారిటీ ఆల్రెడీ వచ్చేసినట్టే.

అందుకు తగ్గట్టుగా బన్నీ లుక్ కూడా స్టైలిష్‌గా ప్లాన్ చేస్తున్నారా..? అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. లుక్ టెస్ట్‌లో భాగంగా చేసిన ఫోటో షూట్ పిక్కే ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది అన్న టాక్ వినిపిస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవరీకర్ తీసిన ఈ ఫోటోలో బన్నీ లుక్ సూపర్బ్ అనిపించేలా ఉండటంతో... పుష్ప 2లో ఇదే లుక్‌లో కనిపిస్తే సినిమా మరో రేంజ్‌లో ఉంటుందంటున్నారు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్.

ఒక్క ఫోటోతోనే నేషనల్ లెవల్‌లో రచ్చ చేసిన బన్నీ ఫుల్ సినిమా ఇదే లుక్‌లో కనిపిస్తే మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్.
