Rashmika Mandanna: ‘ఈరోజు నీకోసం ఏదో అద్భుతం’.. టాటూతో రష్మిక క్రేజీ పోస్ట్..

"ఈరోజు నీ కోసం ఏదో అద్భుతం !". అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Rashmika Mandanna: 'ఈరోజు నీకోసం ఏదో అద్భుతం'.. టాటూతో రష్మిక క్రేజీ పోస్ట్..
Rashmika Mandanna
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2022 | 2:59 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకుంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి.. గీతా గోవిందం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవల అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది. ఇందులో శ్రీవల్లి పాత్రలో గ్రామీణ యువతిగా కనిపించి మెప్పించింది. ఇక సోషళ్ మీడియాలో రష్మికకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేషనల్ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. తెలుగుతోపాటు, తమిళ్, కన్నడ, హిందీలో వరుస ఆఫర్లు అందుకుంటున్న రష్మిక.. మరో వైపు నెట్టింట్లోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టాలో అందమైన ఫోటోస్ షేర్ చేస్తూ.. ఇంట్రెస్టంగ్ క్యా్ప్షన్ ఇచ్చింది.

తన చేతిపై ఉండే టాటూను చూపిస్తూ.. బ్లాక్ అండ్ బ్లాక్ లో చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోస్ షేర్ చేసింది. ఆమె చేతిపై ఇర్రీప్లేసబుల్ అని టాటూ కనిపిస్తుంది. “ఈరోజు నీ కోసం ఏదో అద్భుతం !”. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అందానికే ప్రతిరూపం నువ్వు.. గార్జియస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2, యానిమల్, గుడ్ బై, మిషన్ మజ్ను, వరిసు చిత్రాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

రష్మిక ఇన్‏స్టా పోస్ట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.