AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Be Alert: ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో మర్చిపోయి కూడా ఈ పని చేయకండి.. లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది..!

Office Laptop: ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలోనే పనులు చేస్తున్నారు.

Be Alert: ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో మర్చిపోయి కూడా ఈ పని చేయకండి.. లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది..!
Computer
Shiva Prajapati
|

Updated on: Jul 25, 2022 | 6:24 AM

Share

Office Laptop: ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలోనే పనులు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభన తరువాత ఐటీ కంపెనీ సహా అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తున్నాయి. వారు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ల్యాప్‌టాప్‌లు, ఇతర సౌకర్యాలన్నింటినీ కల్పిస్తున్నాయి. తద్వారా ఉద్యోగులు తమ పనిని ఇంటి నుంచే చేసేస్తున్నారు. అయితే, చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత పనిని సైతం ఆఫీసు ల్యాప్‌టాప్‌లో చేస్తున్నారు. అలా చేయడం పెద్ద పొరపాటు అనే చెప్పాలి. తెలియక చేసినా, తెలిసి చేసినా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. ఆఫీస్ ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి. లేదంటే.. మీ ఉద్యోగానికే ఎసరు తెస్తుంది. మరి ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఏం చేయొద్దో ఇప్పుడు తెలుసుకుందాం..

వేరే ఉద్యోగం కోసం వెతకడం ఆపేయండి.. చాలా మంది వ్యక్తులు తమ షిఫ్టుల సమయంలో ఆఫీసు ల్యాప్‌టాప్‌లలో ఇతర ఉద్యోగాల కోసం వెతుకుతారు. అయితే కొన్ని సందర్భాల్లో మీ కార్యాలయంలోని IT బృందం మీ పనిని గమనిస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలో మీరు మరొక ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తున్నట్లుగా వారికి తెలిసిపోతుంది. ఈ కారణంగా ఆఫీస్ సిస్టమ్ నుండి ఉద్యోగాలను వెతకడం, మీ రెజ్యూమ్‌ని ఎక్కడికైనా పంపడం వంటి పనులను చేయకుండా ఉండండి.

వ్యక్తిగత డేటా, ఫైల్స్‌ను అస్సలు సేవ్ చేయొద్దు.. చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత డేటాను, ఫైల్స్‌ను తమ పని సమయంలో ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో సేవ్ చేసుకుంటుంటారు. అయితే, అలా అస్సలు చేయకూడదు. దీని కారణంగా మీ వ్యక్తిగత విషయాలు లీక్ అయ్యే ప్రమాదం ఉంది.

చాట్ చేయవద్దు.. చాలా కంపెనీలు తమ స్వంత చాట్ ప్రోగ్రామ్‌లను కలిగి ఉంటాయి. అక్కడ వారు ఇతర ఉద్యోగులతో కనెక్ట్ అయి ఉంటారు. అదే సమయంలో చాలా మంది ఆఫీస్‌లో గ్రూప్‌గా ఏర్పడి వారితో ఇష్టమున్నట్లు చాటింగ్ చేస్తుంటారు. ఇలాంటి పనులు చేయడం కూడా తప్పుగా పరిగణించబడుతుంది. ఇది మీ ఉద్యోగాన్నే రిస్క్‌లో పడేస్తుంది.

అభ్యంతరకరమైన కంటెంట్ కోసం వెతకొద్దు.. చాలా సార్లు ఉద్యోగులు తమ షిఫ్ట్ సమయంలో లేదా ఖాళీ సమయంలో ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో Googleలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెతుకుతారు. అదే సమయంలో, కొంతమంది ఆఫీసు ల్యాప్‌టాప్‌లలో పోర్న్ చూస్తుంటారు. ఇలాంటి పనులు ఆఫీస్ ల్యాప్‌టాప్‌లో ఏమాత్రం చేయకూడదు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. మీరు మీ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో ఏం వెతుకుతున్నారో ఆఫీస్‌లోని IT బృందానికి తెలిసిపోతుంది. కాబట్టి.. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త తప్పనిసరి.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..