Gmail: జీమెయిల్‌లో స్పేస్‌ ఫుల్‌ అయ్యిందంటూ అలర్ట్‌ వస్తోందా.? ఈ సింపుల్ ట్రిక్‌ ఫాలో అవ్వండి..

Gmail: మెయిల్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది జీమెయిల్‌ ఒక్కటే. ఇతర మెయిల్‌ సర్వీసెస్‌ అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది ఉపయోగించేది మాత్రం జీమెయిల్‌నేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు...

Gmail: జీమెయిల్‌లో స్పేస్‌ ఫుల్‌ అయ్యిందంటూ అలర్ట్‌ వస్తోందా.? ఈ సింపుల్ ట్రిక్‌ ఫాలో అవ్వండి..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 26, 2022 | 8:59 AM

Gmail: మెయిల్‌ అంటే అందరికీ గుర్తొచ్చేది జీమెయిల్‌ ఒక్కటే. ఇతర మెయిల్‌ సర్వీసెస్‌ అందుబాటులో ఉన్నా ఎక్కువ మంది ఉపయోగించేది మాత్రం జీమెయిల్‌నేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూజర్‌ ఫ్రెండ్లీగా ఉండడం, మెయిల్స్‌ను సింపుల్‌గా యాక్సెస్‌ చేసుకునే వీలు ఉండడంతో ఎక్కువ మంది దీనినే ఉపయోగిస్తుంటారు. ఇక ప్రతీ రోజూ వందలాది మెయిల్స్‌తో అకౌంట్‌ నిండిపోతుంటుంది. ప్రకటనల నుంచి మొదలు ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేస్తే వచ్చే అలర్ట్‌ వరకు ఇలా వందలాది మెయిల్స్‌ ఇన్‌బాక్స్‌లో నిండిపోతుంటాయి.

జీమెయిల్‌లో ఉండే స్పేస్‌ ఫుల్‌ కావడంతో కొత్త మెసేజ్‌లు ఇన్‌బాక్స్‌లోకి రావు. ఇందుకోసం మెయిల్స్‌ను క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువ మెమోరీతో కూడిన మెయిల్స్‌ను డిలీట్‌ చేయడం ద్వారా స్పేస్‌ను తగ్గించుకోవచ్చు. అయితే వందలాది మెయిల్స్‌లో ఎక్కువ డేటా ఉన్న మెయిల్స్‌ ఏంటనేది తెలుసుకోవడం అంత సులువు కాదు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే జీమెయిల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఇందుకోసం యూజర్లు సెర్చ్‌ ట్యాబ్‌లో ‘has:attachment larger:10M’ అని టైప్ చేయాలి. దీంతో 10 ఎమ్‌బీ కంటే ఎక్కువ మెమోరీ ఉన్న మెయిల్స్‌ డిస్‌ప్లే అవుతాయి. వాటిని సెలక్ట్‌ చేసుకొని డిలీట్‌ చేస్తే సరిపోతుంది. దీంతో పాటు గూగుల్‌ ఆటో-డిలీషన్‌ అనే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. దీని సహాయంతో యూజర్లు సెట్‌ చేసుకున్న ఫిల్టర్‌ల ఆధారంగా మెయిల్స్‌ను డిలీట్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..