AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఇకపై ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరికీ కనిపించరు.. అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌..

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు పెట్టింది పేరు...

WhatsApp: ఇకపై ఆన్‌లైన్‌లో ఉన్నా ఎవరికీ కనిపించరు.. అదిరిపోయే ఫీచర్‌ను తీసుకొస్తున్న వాట్సాప్‌..
Narender Vaitla
|

Updated on: Jul 24, 2022 | 7:07 AM

Share

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు పెట్టింది పేరు. యూజర్‌ ఫ్రెండ్లిగా ఉండడం, వినియోగదారుల అభిరుచులకు, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకువస్తుండడం వల్లే ఈ యాప్‌కు ఇంత ఆదరణ లభించింది అని చెప్పొచ్చు. ఇక ప్రైవసీ పెద్ద పీట వేసే వాట్సాప్‌ యూజర్ల భద్రత కోసం నిత్యం ఏదో ఒక అప్‌డేట్ తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

‘హైడ్‌ ఆన్‌లైన్‌ స్టేటస్‌’ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తాము ఆన్‌లైన్‌లో ఉన్న విషయాన్ని ఎవరికీ తెలియకుండా చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ వెర్షన్ 2.22.16.12 కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌ చేసుకుంటే యూజర్లు తాము ఆన్‌లైన్‌లో ఉన్న విషయాన్ని ఎవరికీ కనిపించకుండా చేసుకోవచ్చు. అంతకుముందు కేవలం లాస్ట్‌ సీన్‌ను హైడ్‌ చేసుకునే అవకాశం మాత్రమే ఉండేది ఇప్పుడు ఈ వరుసలో ఆన్‌లైన్‌ స్టేటస్‌ను వాట్సాప్‌ చేర్చింది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో అకౌంట్‌ సెక్షన్‌లోకి వెళ్లి ప్రైవసీలో లాస్ట్‌సీన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఈ లాస్ట్‌ సీన్‌ ఆప్షన్‌లోనే వాట్సాప్‌ హైడ్‌ ఆన్‌లైన్‌ స్టేటస్‌ అనే ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ ఫోన్‌లలో ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..