- Telugu News Photo Gallery Technology photos Searching best gaming smartphone under 12000. These are the 5 smart phones Telugu Tech News
Best Gaming Phones: బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం వెతుకుతున్నారా.? రూ. 12 వేల లోపు అదిరిపోయే ఫోన్స్ ఇవే..
Best Gaming Phones: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ అడుతోన్న వారి సంఖ్య పెరిగిపోయింది. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు భారీ స్క్రీన్, ప్రాసెసర్‌తో మొబైల్స్‌ను తయారు చేస్తుండడమే దీనికి కారణం. అయితే రూ. 12 వేల లోపు అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.
Updated on: Jul 23, 2022 | 6:33 PM

Xiaomi Redmi 10 Prime: రూ. 11,499కి అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. మీడియా టెక్ హిలీయో జీ88 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌ను అందించారు. ఇందులోని ర్యామ్, ప్రాసెసర్ గేమ్స్‌కు పర్‌ఫెక్ట్‌గా సపోర్ చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

INFINIX NOTE 11: 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. గేమింగ్‌కు సపోర్ట్ చేసే మీడియా టెక్ హీలియో జీ88 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో రూపొందించిన ఈ ఫోన్ రూ. 12,499కి అందుబాటులో ఉంది. 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా ఈ ఫోన్ సొంతం. ఇందులో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

REALME NARZO 50A: 6000 ఎమ్‌ఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియా టెక్ హీలియో జీ85 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 11,499కి అందుబాటులో ఉంది. ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

REALME C35: ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ యూనిసోక్ టీ616 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గేమింగ్‌కు సపోర్టివ్‌గా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.6 ఇంచెస్ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీతో పనిచేసే ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు.

INFINIX HOT 11S: రూ. 12 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్‌లో ఇన్‌ఫినిక్స్ ఒకటి. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. రూ. 10,499కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. 50 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.





























