Google Wallet: గూగుల్ నుంచి కొత్త పేమెంట్స్ యాప్.. డబ్బులు పంపించుకోవడమే కాదు, అంతకు మించి..
Google Wallet: ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. టీ కొట్టులో కూడా యాప్ ద్వారా పేమెంట్స్ చేసే రోజులు వచ్చేశాయ్. రకరకాల యాప్‌లు అందుబాటులోకి రావడం, ప్రభుత్వం సైతం డిజిటల్...
Google Wallet: ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. టీ కొట్టులో కూడా యాప్ ద్వారా పేమెంట్స్ చేసే రోజులు వచ్చేశాయ్. రకరకాల యాప్‌లు అందుబాటులోకి రావడం, ప్రభుత్వం సైతం డిజిటల్ పేమెంట్స్‌కి పెద్ద పీట వేయడంతో యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఇప్పటికే గూగుల్‌పే (Goole Pay) పేరుతో ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గూగుల్‌పేకు ప్రత్యామ్నాయంగా గూగుల్ వాలెట్ పేరుతో కొత్త యాప్‌ను తీసుకొస్తున్నారు.
యాప్‌ను ముందుగా భారత్ సహా 39 దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్, వేర్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పనిచేసే డివైజ్‌లలో ఈ యాప్‌ను అందించనున్నారు. డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌లో ఇప్పటి వరకు అందుబాటులో లేని ఎన్నో సరికొత్త ఫీచర్లను గూగుల్ వాలెట్‌లో పరిచయం చేయనున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను, ట్రాన్సిట్ కార్డులను ఈ యాప్‌లో స్టోర్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఇక భద్రతకు కూడా ఈ యాప్‌లో పెద్ద పీట వేయనున్నారు.
సెక్యూరిటీ కోసం ఫేస్ రికగ్నిషన్, పాస్‌వర్డ్ లాకింగ్ ఫీచర్లను అందిస్తోంది. అలాగే యాప్‌లో ఉండే డేటాకు భద్రకై ఎన్‌క్రిప్షన్ ప్రొటెక్షన్‌ను అందిస్తోంది. గూగుల్ వాలెట్ యాప్ ద్వారా ఇతర యాప్‌ల అవసరం లేదకుడా టికెట్ రిజర్వేషన్, టికెట్ బుకింగ్ వంటి సేవలను పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..