Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo reno 8: లేటెస్ట్‌ ఫీచర్లు, స్టైలిష్‌ లుక్‌తో ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మొదలైన ప్రీ-ఆర్డర్‌లు..

Oppo reno 8: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒప్పో రెనో 8పేరుతో లాంచ్‌ చేస్తున్న ఈ ఫోన్‌లో తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చారు...

Oppo reno 8: లేటెస్ట్‌ ఫీచర్లు, స్టైలిష్‌ లుక్‌తో ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. మొదలైన ప్రీ-ఆర్డర్‌లు..
Oppo Reno 8
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 24, 2022 | 12:16 PM

Oppo reno 8: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఒప్పో రెనో 8పేరుతో లాంచ్‌ చేస్తున్న ఈ ఫోన్‌లో తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చారు. త్వరలోనే సేల్ ప్రారంభంకానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రీ-ఆర్డర్‌లను సంస్థ ప్రారంభించింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆన్‌లైన్‌ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు మీకోసం..

ఒప్పో రెనో 8 స్మార్ట్‌ ఫోన్‌లో 6.43 ఇంచెస్‌ ఫూల్‌ హెచ్‌డీ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్‌, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఈ ఫోన్‌ స్క్రీన్‌ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 80 వాట్స్‌ సూపర్‌ ఫ్లాష్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందంచారు. ఈ ష్లాష్‌ చార్జింగ్‌ సపోర్ట్‌తో కేవలం 11 నిమిషాల్లోనే 50 శాతం చార్జ్‌ అవుతుంది.

కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 8జీబీ ర్యామ్‌+128 స్టోరేజ్‌ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 29,999గా ఉంది. అయితే పలు బ్యాంక్‌లు క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 3000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్