Pawan Kalyan: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. హరిహర వీరమల్లు షూటింగ్‌ పునఃప్రారంభం ఎప్పుడంటే?

Hari Hara Veera Mallu: ఈ ఏడాది ప్రారంభంలో భీమ్లానాయక్‌ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌కు జోష్‌ తీసుకొచ్చాడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan). అదే జోరులో వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో క్రిష్‌ జాగర్ల మూడీ దర్శకత్వంలో..

Pawan Kalyan: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. హరిహర వీరమల్లు షూటింగ్‌ పునఃప్రారంభం ఎప్పుడంటే?
Hari Hara Veera Mallu
Follow us
Basha Shek

|

Updated on: Jul 26, 2022 | 8:02 PM

Hari Hara Veera Mallu: ఈ ఏడాది ప్రారంభంలో భీమ్లానాయక్‌ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌కు జోష్‌ తీసుకొచ్చాడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan). అదే జోరులో వరుసగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో క్రిష్‌ జాగర్ల మూడీ దర్శకత్వంలో హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu) కూడా ఒకటి. చాలారోజుల క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌కు కరోనాతో బ్రేకులు పడ్డాయి. ఇదే క్రమంలో పవన్‌ తన రాజకీయ వ్యవహారాల్లో బిజీ కావడంలో ఈ సినిమా ఆగిపోయిందన్న వార్తలు వ్యాపించాయి. దీనికి తోడు సినిమాపై ఎలాంటి అప్‌డేట్స్‌ రాకపోవడంతో పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ నిరాశలో మునిగిపోయారు. అయితే తాజాగా హరిహరవీరమల్లు షూటింగ్‌పై ఒక అప్‌డేట్‌ వచ్చింది. ఆగస్టు మొదటివారంలో ఈ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభంకానుందట. నవంబర్‌ మొత్తం కల్లా సినిమాను పూర్తి చేసి సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేసేందుకు మూవీ మేకర్స్‌ ప్లాన్‌ చేసుకున్నారట.

కాగా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం పవన్‌ ప్రత్యేక కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియోలు ఆసక్తిని పెంచాయి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన బబ్లీ బ్యూటీ నిధి అగర్వాల్‌ సందడి చేయనుంది. అర్జున్‌ రామ్‌పాల్‌, నర్గీస్‌ ఫక్రి వంటి బాలీవుడ్‌ తారలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ఈ సినిమను మెగా సూర్య ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్‌పై ఏఎమ్ ర‌త్నం, ద‌యాక‌ర్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ్‌ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే