Ramya Krishnan: మేడం సార్ మేడం అంతే.. సామజవరగమన సాంగ్‌కు స్టెప్పులేసిన రమ్యకృష్ణ
100 శాతం తెలుగు కంటెంట్ తో ఆకట్టుకుంటున్న ఆహా. సరికొత్త సినిమాలతో ఆసక్తికర వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది.
100 శాతం తెలుగు కంటెంట్ తో ఆకట్టుకుంటున్న ఆహా(aha). సరికొత్త సినిమాలతో ఆసక్తికర వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తోంది. గేమ్ షోలతో పాటు అదిరిపోయే డాన్స్ షోను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఆహా టీమ్. డాన్స్ ఐకాన్ అనే టైటిల్ తో ఓ సూపర్ డాన్స్ ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నారు ఆహా టీమ్. ఈ షోకు అలనాటి అందాల తార రమ్యకృష్ణ జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ డాన్స్ షో కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఓంకార్ హోస్ట్ చేస్తున్న ఈ డాన్స్ లో శేఖర్ మాస్టర్ కూడా జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా శేఖర్ మాస్టర్ రమ్యకృష్ణతో కలిసి చేసిన డాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
రెడ్ కలర్ శారీలో రెడ్ హాట్ గా మెరిసిన రమ్యకృష్ణ అదే గ్రేస్‌తో స్టెప్పులేసి అదరగొట్టారు. అల్లు అర్జున్ అలవైకుఠపురంలో సినిమాలోని సామజవరగమన సాంగ్ కు శేఖర్ మాస్టర్ తో కలిసి డాన్స్ చేశారు రమ్యకృష్ణ. ఈ డాన్స్ చూసిన తర్వాత యాంకర్ శ్రీముఖి ‘మేడం సార్ మేడం అంతే’ అంటూ కామెంట్ చేసింది. నిజంగా ఆమె అన్నట్టు ఈ డాన్స్ చూస్తే మీరు అదే అంటారు. ఇక ఈ డాన్స్ షోకు తనదైన స్టైల్ లో జడ్జ్ గా వ్యవహరించనున్నారు రమ్యకృష్ణ. రమ్యకృష్ణ ఇలా జడ్జ్ గా వ్యవహరించడం తెలుగు బుల్లితెరపై ఇదే తొలిసారి. రమ్యకృష్ణ జడ్జ్ గా ఉండటంతో ఈ షో రెట్టింపు ఉత్సహంతో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.