Samantha Ruth Prabhu: వారసుడు కోసం సమంత శాకుంతలం రిలీజ్ డేట్ మార్చుకుందా..?

అందాల భామ సమంత సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సామ్ జోరు తగ్గించిందనే చెప్పాలి.

Samantha Ruth Prabhu: వారసుడు కోసం సమంత శాకుంతలం రిలీజ్ డేట్ మార్చుకుందా..?
Samantha Shakuntalam
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 23, 2022 | 10:10 AM

అందాల భామ సమంత(Samantha)సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సామ్ జోరు తగ్గించిందనే చెప్పాలి. పెళ్లితర్వాత ఆచితూచి సినిమాలు చేసిన సామ్.. విడిపోయిన తర్వాత మాత్రం చాలా గ్యాప్ తీసుకుంది. అటు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది సమంత. ఎప్పుడూ ఫోటోషూట్స్..చిట్ చాట్స్ అంటూ సందడి చేసే సామ్ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. దాంతో ఈ అమ్మడు ఎక్కడ ఉంద్..? ఎం చేస్తుంది అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. మొన్నామధ్య యశోధ, ఖుషి చిత్రాల షూటింగ్స్‏లో పాల్గోంటూ తెగ బిజీ అయిపోయింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, గ్లింప్స్ సినిమాలపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వచ్చి చాలా రోజులైపోయింది.

ఆ తర్వాత తమిళ్ లో విజయ్ సేతుపతి కన్మణి రాంబో ఖతీజా సినిమాలో కనిపించింది సమంత ఈ సినిమా ఆశించినస్థాయిలో తెలుగులో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే శాకుంతలం అనే హిస్టారికార్ మూవీతో రానుంది సామ్. అయితే శాకుంతలం సినిమా రిలీజ్ విషయంలో ప్రస్తుతం సందిగ్ధత నెలకొందని తెలుస్తోంది. శాకుంతలం సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అదే సమయంలో దళపతి విజయ్ నటించిన వారసుడు సినిమా కూడా అదే సమయానికి విడుదల కానుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలు క్లాష్ అవ్వకుండా సమంత సినిమా రిలీజ్ డేట్ ను మార్చేస్తున్నారట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ తొలివారంలో లేదా.. నవంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి