Ramayana Movie: బీఫ్ తినేవాడికి రాముడి పాత్రనా? హీరో రణ్‌బీర్ కపూర్‌పై ట్రోల్స్.. చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ కు సంబంధించి ఒక వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. ఈ నేపథ్యంలోనే 'రామాయణం' సినిమాలో అతను పోషిస్తోన్న రాముడి పాత్రపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే ఈ విషయంపై గాయని చిన్మయి శ్రీపాద ట్వీట్ చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

బాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం’ ముస్తాబవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. దీనికి ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు. గతంలో ఈ పాత్రకు అతనిని ఎంపిక చేసినప్పుడు, కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనికి కారణం రణబీర్ కపూర్ పర్సనల్ లైఫ్ స్టైల్. మరో ప్రముఖ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా రణబీర్ కపూర్ ఎంపికను వ్యతిరేకించింది. ఇప్పుడు ఈ సినిమాపై మరో వివాదం మొదలైంది. తాను బీఫ్ తినడమంటే ఇష్టమంటూ రణబీర్ కపూర్ చెబుతున్న వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. గతంలో, ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ దీని గురించి మాట్లాడారు. తనకు బీఫ్ అంటే ఇష్టమని అతను ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. రామాయణం గ్లింప్స్ రిలీజ్ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై విమర్శలు గుప్పిస్తున్నారు. గొడ్డు మాంసం తినే నటుడిని రాముడి పాత్రలో నటింపజేయడం సరైనదేనా? బాలీవుడ్‌లో అసలు ఏం జరుగుతోంది అని కొందరు అడుగుతున్నారు. దీనిపై రణ్‌బీర్ కపూర్ కానీ చిత్ర బృందం కానీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
అదే సమయంలో చాలా మంది హీరో రణ్ బీర్ కపూర్‌కు సపోర్టుగా నిలుస్తున్నారు. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విషయంపై పోస్ట్ చేస్తూ.. ‘దేవుని పేరు చెప్పుకుని బాబాజీ రేపిస్ట్ కావచ్చు. … జైల్లో నుంచి బయటకు వచ్చిఎన్నికల్లో ఓట్లు కూడా సంపాదించి గెలవొచ్చు.. ఇదే భక్త్ ఇండియా.. అలాంటప్పుడు ఎవరో ఏదో తిన్నారంటే.. అదేం పెద్ద సమస్య కాదుగా’ అని చిన్మయి రాసుకొచ్చింది. అయితే ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది చిన్మయికి సపోర్టుగా మాట్లాడితే మరికొందరు మాత్రం సింగర్ ను విమర్శిస్తున్నారు.
రామయణ్ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. నమిత్ మల్హోత్రాతో పాటు హీరో యష్ కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామాయణం’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 2026 దీపావళికి విడుదల కానుంది. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, రవి దూబే, సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్, వివేక్ అగ్నిహోత్రి, అరుణ్ గోవిల్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
సింగర్ చిన్మయి ట్వీట్..
A babaji who uses the name of God can be a rapist and he can keep getting parole to get votes in bhakt India – however what someone eats is a big problem. https://t.co/w7FYienmke
— Chinmayi Sripaada (@Chinmayi) July 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..