Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పుడు కేఫ్‌లో టేబుల్స్ క్లీన్‌ చేశాడు.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. ఎవరో తెలుసా?

ఈ స్టార్ హీరోకు ఆత్మాభిమానం ఎక్కువ. అందుకే సినిమా ఇండస్ట్రీలో తనకు తెలిసిన వారున్నా సొంత కాళ్లపైనే నిలబడేందుకు ప్రయత్నించాడు. స్వయం కృషితోనే పైకి ఎదిగాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఇబ్బందులు, కష్టాలను అధిగమించ ప్రస్తుతం దేశంలో టాప్ మోస్ట్ హీరోగా వెలుగొందుతున్నాడు.

Tollywood: ఒకప్పుడు కేఫ్‌లో టేబుల్స్ క్లీన్‌ చేశాడు.. ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు.. ఎవరో తెలుసా?
Bollywood Actor
Basha Shek
|

Updated on: Jul 06, 2025 | 2:32 PM

Share

బ్యాక్ గ్రౌండ్.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం. స్టార్ హీరోల వారసుల్లో చాలా మంది బ్యాక్ గ్రౌండ్ ట్యాగ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు. అవకాశాలు సొంతం చేసుకుంటారు. అదే సమయంలో మరికొందరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వస్తారు. స్వయం కృషితో సినిమా అవకాశాలు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొంటారు. అయినా వెనకడుగు వేయకుండా స్టార్ హీరోలుగా క్రేజ్ సొంతం చేసుకుంటారు. ఈ స్టార్ హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. సినిమా ఇండస్ట్రీలో బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తన స్వశక్తినే నమ్ముకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. మొదట కాపీ రైటర్ గా, ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ హీరోల్లో ఇతను కూడా ఒకడు. అలాగే భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటోన్న నటుల్లో కూడా ఒకడు. అతను మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్.

1985 జూలై 6న ముంబైలో జన్మించిన రణ్ వీర్ కు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉండేది. అయితే తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడిని బాగా చదివించాలనుకున్నారు. ముంబైలోని హెచ్ ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో చదువు పూర్తి చేసిన రణ్ వీర్ ఆ తరువాత అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ బ్లూమింగ్టన్‌కు వెళ్లాడు. అక్కడ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ క్రమంలో ఒకవైపు ఆయన చదువుకుంటూనే మరోవైపు పాకెట్ మనీ కోసం ఒక కేఫ్‌లో పనిచేశాడు. 2007లో ఇండియాకు తిరిగొచ్చి సినిమా ఛాన్సుల కోసం వెతకడం మొదలు పెట్టాడు. హీరోయిన్ సోనమ్ కపూర్ రణ్ వీర్ కు దగ్గరి బంధువు అవుతుంది. అలాగే అనిల్ కపూర్ మామ అవుతాడు. కానీ వారెవరి సాయం ఆశించకుండా మొదట కాపీ రైటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత అసిస్టెంట్ గా కూడా పని చేశాడు.

ఇవి కూడా చదవండి

భార్య దీపిక పదుకొణెతో..

మనీష్ శర్మ బ్యాండ్ బాజా బారాత్ తో హీరోగా మారిన రణ్ వీర్ సింగ్ ఆ తర్వాత తిరిగి వెనక్కి చూసుకోలేదు. లేడీస్ వర్సెస్ రికీ బహల్, గుండే, బాజీరావు మస్తానీ, పద్మావత్, లూటేరా, 83, , రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. కామెడీ నుండి యాక్షన్ వరకు, రణ్‌వీర్ ఏ పాత్రనైనా పోషించగల బహుముఖ నటుడని పేరుంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. రణ్‌వీర్ సింగ్ 2018లో బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొనేను వివాహం చేసుకున్నాడు. గతేడాది వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..