AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Pothineni: రామ్ పోతినేని- బోయపాటి సినిమా నుంచి క్రేజీ ఆప్డేట్.. రచ్చ చేయడానికి రెడీ అవుతున్న ఎనర్జిటిక్ స్టార్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని‌కి అర్జెంట్ గా హిట్ కావలి. అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ హిట్ అందుకోలేకపోయాడు.

Ram Pothineni: రామ్ పోతినేని- బోయపాటి సినిమా నుంచి క్రేజీ ఆప్డేట్.. రచ్చ చేయడానికి రెడీ అవుతున్న ఎనర్జిటిక్ స్టార్
Ram Pothineni, Boyapati Sri
Rajeev Rayala
|

Updated on: Sep 28, 2022 | 6:54 AM

Share

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని‌కి అర్జెంట్ గా హిట్ కావలి. అప్పుడెప్పుడో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ హిట్ అందుకోలేకపోయాడు. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు పూరిజగన్నాథ్. అప్పటివరకు వరకు లవర్ బాయ్ గా ఉన్న రామ్ ను ఊర మాస్ లుక్ లో చూపించాడు పూరి. ఇక ఈ సినిమాలో తనదైన డైలాగ్ డెలివరీతో.. తెలంగాణ యాసలో.. యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు రామ్. ఇక ఈ సినిమా తర్వాత రెడ్ అనే సినిమా చేశాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో వారియర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భారీ అంచనాల మధ్య వచ్చిన వారియర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. తమిళ్ తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమాలో అందాల భామ కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు టాప్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నాడు బోయపాటి. బాలయ్య నటించిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. బాలకృష్ణ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గానిలిచింది అఖండ. ఇక ఇప్పుడు అందరి చూపు రామ్, బోయపాటి సినిమా పైనే.. అటు రామ్ , ఇటు బోయపాటి చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అవ్వడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారట బోయపాటి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడట బోయపాటి. ఇందుకోసం దాదాపు వంద కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. కానీ అనుకోని విధంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఆ రెగ్యులర్ షూట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. దసరా పండుగ తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ సీజన్లో రోహిత్ 500+ రన్స్ కచ్చితంగా కొడతాడు : స్టెయిన్
ఈ సీజన్లో రోహిత్ 500+ రన్స్ కచ్చితంగా కొడతాడు : స్టెయిన్
అందరి మనసులను దోచుకుంటున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!
అందరి మనసులను దోచుకుంటున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!
శ్రీదేవితోనే ప్రాబ్లమ్.. ఆమె ఉంటే సినిమా చేయనున్న హీరోయిన్
శ్రీదేవితోనే ప్రాబ్లమ్.. ఆమె ఉంటే సినిమా చేయనున్న హీరోయిన్
ఘాతుకం.. ఏడేళ్ల బాలికను చంపి డ్రమ్ములో పడేశారు..!
ఘాతుకం.. ఏడేళ్ల బాలికను చంపి డ్రమ్ములో పడేశారు..!
గోల్‌మాల్ నటి అశ్విని కల్సేకర్ చేసిన దోసకాయ పచ్చడి
గోల్‌మాల్ నటి అశ్విని కల్సేకర్ చేసిన దోసకాయ పచ్చడి
మొదటి 2 వారాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ధోని దూరం..
మొదటి 2 వారాలు ఐపీఎల్ మ్యాచ్‌లకు ధోని దూరం..
ఈరోజు చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం ఖాయం.. వద్దన్నా వరదలా డబ్బు..!
ఈరోజు చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం ఖాయం.. వద్దన్నా వరదలా డబ్బు..!
మీ విజయాన్ని నిర్ణయించేది మనశ్శాంతికి ఇస్తున్న ప్రయారిటీనే
మీ విజయాన్ని నిర్ణయించేది మనశ్శాంతికి ఇస్తున్న ప్రయారిటీనే
దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులంపై భారీగా పెరుగుదల
దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. తులంపై భారీగా పెరుగుదల
మన తెలంగాణలో దొరికే దీని జ్యూస్ తాగితే నూరేళ్లు బతుకుడు పక్కా..
మన తెలంగాణలో దొరికే దీని జ్యూస్ తాగితే నూరేళ్లు బతుకుడు పక్కా..