నందమూరి ఫ్యాన్స్‌ను కెలికిన ఆర్జీవీ.. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు చూడలేదట..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు ఆర్జీవీ. తాజాగా ఆయన బాలకృష్ణ మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎం చేసిన సంచలనంగా మారింది. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది. వివాదం లేకుండా వర్మ ఉండలేరు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతోనే కాదు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం అనేది వర్మకే సాధ్యం.. దేనికి భయపడని ఆర్జీవీ.. తన మనసులో మాట కూడా మొఖంమీద చెప్పేస్తారు. ముక్కుసూటిగా మాట్లాడతారు ఆర్జీవీ. సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసే పోస్ట్ లు కూడా కొన్ని వివాదాలకు దారి తీస్తున్నాయి. అలాగే మొన్నటివరకు మెగా హీరోలను టార్గెట్ చేసిన వర్మ.. ఇప్పుడు నందమూరి ఫ్యాన్ కు కోపం తెప్పించారు. ఏకంగా బాలయ్య పైనే కామెంట్స్ చేశారు వర్మ.
వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ కూడా చేశారు. రీ రిలీజ్ లోనూ శివ సినిమా నయా రికార్డ్ క్రియేట్ చేసింది. థియేటర్స్ లో శివ సినిమాను ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే తాజాగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. దాంతో ఇప్పుడు వర్మ పై నందమూరి ఫ్యాన్ ఫైర్ అవుతున్నారు.
నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాలయ్య పేరు మారుమ్రోగుతుంది. ప్రస్తుతం అఖండ 2 సినిమా చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ విడుదల చేశారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ బాలకృష్ణ గారి గురించి చెప్పండి అది అడిగింది. దాంతో వర్మ మాట్లాడుతూ..” నేను ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు చూడలేదు. 30 ఏళ్ల క్రితం ఎప్పుడో చూశాను కానీ,ఇప్పుడైతే ఆయన సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. ఆయన సినిమాలు చూడడం నా సెన్సిబిలిటీలో లేదు” అని చెప్పుకొచ్చారు ఆర్జీవీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో ఆర్జీవీ పై నందమూరి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








