Top9 ET: ‘వారణాసి’ టైటిల్ వివాదం జక్కన్నకు దెబ్బ మీద దెబ్బ
రాజమౌళి చిక్కుల్లో పడ్డాడు.ఆయపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాను దేవుళ్లను నమ్మనంటూ రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్‌లో జక్కన్న కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ పైనే రాష్ట్రీమ వానరసేన సంఘం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జక్కన్న చేసిన కామెంట్.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సరూర్ నగర్ పోలీసులు రాజమౌళి పై కేసు నమోదు చేశారు.
గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో దేవుడంటే నమ్మకం లేదన్న జక్కన్న కామెంట్‌ను అటుంచితే ఇప్పుడు ఈ మూవీ చుట్టూ టైటిల్ వివాదం రాజుకుంది. ‘వారణాసి’ టైటిల్‌ని తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామ భక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్, ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసింది. మహేష్ మూవీ ఎనౌన్స్‌మెంట్ కన్నా ముందే తమ బ్యానర్లో వారణాసి టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసినట్టు చిరపురెడ్డి సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. టైటిల్ హక్కులు తమవే అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో టైటిల్ రిజిస్టర్ సందర్భంగా ఇచ్చిన కాపీని కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశాడు. అయితే వారణాసి విషయంలో టైటిల్ మార్పు ఉండకపోవచ్చన్న టాకే వినిపిస్తోంది. ఆల్రెడీ టైటిల్‌లో ‘SS రాజమౌళీస్ వారాణాసి’ అనే ఉంది. అదే టైటిల్‌ను రిజిస్టర్ చేసి ఆ టైటిల్ మీదే సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపులారిటీ ఏమో కానీ.. తన భర్త విషయంలో ఈ నటికి తీవ్ర బాధ
Babar Azam: బాబర్‌పై ఐసీసీ కొరడా.. లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఫైన్
5 ఫోర్లు, 3 సిక్సర్లతో బుడ్డోడి బీభత్సం
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్ బుకింగ్.. భార్యను చంపిన భర్త అరెస్ట్
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

