పాపులారిటీ ఏమో కానీ.. తన భర్త విషయంలో ఈ నటికి తీవ్ర బాధ
బుల్లితెర నటి ప్రేమీ విశ్వనాథ్ (వంటలక్క) తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. బిజీ షెడ్యూల్ కారణంగా భర్తకు దూరంగా ఉండాల్సి వస్తుందని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. వంటలక్క పాత ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతోంది, ఆమె కెరీర్, వైవాహిక జీవితం మధ్య సమతుల్యం గురించి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
బుల్లితెరపై సీరియల్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక సీరియల్స్‌లో అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకుంటున్న సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్ ఒకటి. సాయంత్రం అయితే చాలు ఆడాళ్ళంతా టీవీలకు అతుక్కుపోయి చూసే సీరియల్ ఇది. ఈ సీరియల్ కు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంటుంది. అందులోనూ ఈ సీరియల్ లో వంటలక్క గా చేసిన ప్రేమీ విశ్వనాథ్ తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కార్తీక దీపం 2 సీరియల్‌తో కూడా ప్రేమీ.. తన మ్యాజిక్‌ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలోనే తన లైఫ్ కు సంబంధించిన విశేషాలతో ఎప్పుడూ ఈమె వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు విషయాలతో ఈమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తెలుగులో అవకాశం రావడంతో భర్తను పిల్లలను వదిలేసి ఇక్కడకు వచ్చేశా.. అలాగే బిజీ షెడ్యూల్ కారణంగా తాను తన భర్త నుంచి దూరంగా ఉండాల్సి వస్తోంది అంటూ… ప్రేమి విశ్వనాథ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు భర్త కూడా చాలా బిజీగా ఉంటాడని.. తాను ఒక రాష్ట్రంలో.. తన భర్త మరో రాష్ట్రంలో ఉండడం.. తమిద్దరికీ నచ్చేది కాదంటూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు తామిద్దరం తమ లైఫ్ లో బిజీ బిజీగా ఉండటంతో అస్సలు కలిసుండటం కుదరడం లేదని ప్రేమి చెప్పుకొచ్చారు. తమ బిజీ లైఫ్‌లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కలవడం కుదురుతోందని.. ఎమోషనల్ అయ్యారు. అయితే గతంలోని ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల అవుతోంది. తన మాటలతో ప్రేమి విశ్వనాథ్‌ను మరో సారి ట్రెండ్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Babar Azam: బాబర్‌పై ఐసీసీ కొరడా.. లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఫైన్
5 ఫోర్లు, 3 సిక్సర్లతో బుడ్డోడి బీభత్సం
బంధువు ఆఖరి చూపు కోసం వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

