చలి చంపేస్తున్న వేళ.. వాతావరణశాఖ భారీ వర్షాల అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిన వేళ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ వర్షాలకు కారణమవుతోంది. IMD హెచ్చరిక ప్రకారం, రాబోయే రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తిరుపతిలో ఇప్పటికే వర్షాలకు చలిగాలులు తోడై భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ అయింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తున్న వేళ వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను చలి చంపేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాబోయే రెండు, మూడు రోజులు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని IMD చెబుతోంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో అల్ప పీడనంతో దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన చేశారు. ఈ నెల 22 నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే తిరుపతి, తిరుచానూరు, తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వర్షానికి తోడు తిరుమల కొండపై విపరీతంగా చలి గాలులు వీస్తున్నాయి. వర్షం కారణంగా దర్శనానికి వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వాతావరణం మారింది. కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంనే వెదర్ మారిందంటున్నారు అధికారులు. పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ అయింది. తీరప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల ఆదేశాలు జారీ చేశారు. పుదుచ్చేరి, కారేకాల్‌లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అటు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నంలో అత్యధికంగా 16 సెం.మీ వర్షపాతం నమోదయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాటలకందని మహా విషాదం.. ఒకే కుటుంబంలో 3 తరాలను తుడిచేసిన ప్రమాదం
కారు ముక్కలైనా సేఫ్‌గా బయటపడ్డ నలుగురు
కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్ ట్విస్ట్
కన్నతల్లి మరణం తట్టుకోలేక..కుప్పకూలిన కుమార్తె!
కిటికీలు, అద్దాలతో పవర్ ప్రొడక్షన్.. అందరికీ జీరో బిల్లులే
బైక్ ట్యాక్సీ రైడర్‌గా.. ఓటమి భయం నుంచి బయటపడ్డాడు!
రూ.40 లక్షల జీతం.. బీఎండబ్ల్యూ కారు.. అయినా పేదవాడిగా ఫీలవుతున్నా
పరుపులతో ప్రాణాలు కాపాడిన హీరోలు!

