బంధువు ఆఖరి చూపు కోసం వెళ్లి వస్తూ అనంత లోకాలకు..
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం చిన్న హోతూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న ఆటో బోల్తా పడటంతో తిరుపతయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కడసారి చూపు కోసం వెళ్ళిన తిరుపతయ్య కూడా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది.
బంధువులు ఎవరైనా చనిపోతే ఆఖరి చూపుకోసం దూర ప్రాంతాల నుంచి బంధువులు, మిత్రులు వెళ్తారు. అలా వెళ్తున్నవారు ఒక్కోసారి ఊహించని విధంగా ప్రమాదాల బారిన పడుతుంటారు. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. బంధువు చనిపోతే చివరి చూపు చూసేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు ఓ వ్యక్తి. వజ్రకరూర్ మండలం చిన్న హోతూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టడంతో తిరుపతయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉరవకొండకు చెందిన తిరుపతయ్య.. తన దగ్గరి బంధువు ఒకరు చనిపోతే.. ఆఖరి చూపు కోసం మరికొంతమందితో కలిసి ఆటోలో బయలుదేరి వెళ్లాడు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత అందరూ తిరిగి ఆటోలో బయలు దేరారు. వీరంతా ప్రయాణిస్తున్న ఆటో హోతూరు గ్రామ శివారుకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో ఆటో తిరుపతయ్య మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతయ్యతోపాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తిరుపతయ్య చనిపోయాడు. మిగతా ముగ్గురికీ ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. తమ బంధువు కడసారి చూపు కోసం వెళ్లిన తిరుపతయ్య కూడా అనంతలోకాలకు చేరుకోవడం అందరినీ కలిచివేసింది. తిరుపతయ్య కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నలుగురికి తీవ్రగాయాలు
చలి చంపేస్తున్న వేళ.. వాతావరణశాఖ భారీ వర్షాల అలర్ట్
మాటలకందని మహా విషాదం.. ఒకే కుటుంబంలో 3 తరాలను తుడిచేసిన ప్రమాదం
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

