Ram Gopal Varma: అల్లు అర్జున్ పై ప్రశంసలు కురింపించిన ఆర్జీవీ.. పుష్ప గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. గత నెలలో విడుదలైన ఈ మూవీ

Ram Gopal Varma: అల్లు అర్జున్ పై ప్రశంసలు కురింపించిన ఆర్జీవీ.. పుష్ప గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Rgv
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 06, 2022 | 7:31 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మొదటి రోజునే పాన్ ఇండియా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఎర్రచందనం స్మగ్లింగ్ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో బన్నీ ఊర మాస్ లుక్‏లో కనిపించి అదరగొట్టాడు.. ఈ సినిమాతో సౌత్‏లోనే కాకుండా.. నార్త్ లోనూ ఫాలోయింగ్ అందుకున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కిస్తోన్న ఈ మూవీని మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరుతో విడుదల చేసిన ఈ సినిమా కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. పుష్ప మాత్రమే కాకుండా.. ఆ సినిమాలోని పాటలు యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

ఈ సినిమాలోని ప్రతి సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బన్నీ మేనియా కొనసాగుతుంది. ఈ సినిమాపై సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా అల్లు అర్జున్ పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రశంసించారు. హేయ్ అల్లు అర్జున్, ఆంథిమ్, సత్యమేవ జయతే 2, 83 వంటి సినిమాలున్నా కూడా.. వాటిని దాటుకుని పుష్పతో రీజనల్ సినిమాను నేషనల్ లెవల్‏కు తీసుకెళ్లావ్.. కుదోస్ అని బన్నీపై ప్రశంసలు కురిపించాడు. ఇక హిందీలో ఇప్పటికే 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది పుష్ప. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సూపర్ హిట్ లెవల్లో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‎లో పుష్ప మూవీ జనవరి 7న స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. అనసూయ, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలలో నటించారు.

Also Read: Naa Peru Shiva 2: మరో సినిమాతో ప్రేక్షకుల ముందు రానున్న కార్తీ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు” నాపేరు శివ 2″

Gali Janardhan Reddy Son: హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న గాలి జనార్దన్ రెడ్డి​ కొడుకు.. దర్శకుడు ఎవరంటే..

Rana Daggubati : మరో రీమేక్‌ను లైన్‌లో పెట్టనున్న దగ్గుబాటి హీరో.. శింబు సినిమా పై కన్నేసిన రానా..