Ram Charan-Oscar Award: ‘ఆ విషయంలో సంతోషంగానూ.. టెన్షన్‌గానూ ఉంది’.. ఆస్కార్ అవార్డ్స్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచంలోని భిన్న సంస్కృతులు.. అన్ని వయసులవారిని ఆకట్టుకున్న సందర్భం. లిరిక్స్ అర్ధం కాకపోయినా.. నాటునాటు బీట్ ను మాత్రం ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలాడిస్తుంది.
ఒక్క అడుగు దూరం.. 70గంటల సమయం.. మన తెలుగు దనానికి వన్నె తెచ్చే.. గర్వేంచే క్షణం. ఈ నెల 12న లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఆస్కార్ వేడుక తెలుగు ప్రజల్లో ఉత్కంఠ రేపుతుంది. అస్కార్ కు నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ప్రపంచంలోని భిన్న సంస్కృతులు.. అన్ని వయసులవారిని ఆకట్టుకున్న సందర్భం. లిరిక్స్ అర్ధం కాకపోయినా.. నాటునాటు బీట్ ను మాత్రం ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలాడిస్తుంది. మ్యూజిక్ వింటేనే స్టేప్ వేసేలా చేస్తుంది. మంచి సినిమాకు భాషతో పనిలేదనడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓ ఉదాహరణ.
మరోవైపు ఆస్కార్ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రామ్ చరణ్ రోజుకో హాలీవుడ్ మీడియాతో మాట్లాడారు. తాజాగా ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చెప్పిన ఆసక్తికర విషయాలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు రామ్ చరణ్. ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో మేం ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమ, అభినందనలు దక్కాయంటూ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మంచి సినిమాకు భాషతో పనిలేదనడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఓ ఉదాహరణ అని చెప్పారు. ఇప్పుడు సినిమా గ్లోబల్ అయ్యిందన్నారు. ఇలాంటి సినీ గ్లోబలైజేషన్ సమయంలో తాను సినీ ఇండస్ట్రీలో ఉండటం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.
ఇదే సందర్భంగా తనకు హాలీవుడ్ పై ఉన్న మమకారాన్ని బయటపెట్టారు రామ్ చరణ్. తాను హాలీవుడ్‌లో చాలా మంది దర్శకులతో కలిసి పని చేయాలనుకుంటున్నానని .. వారిలో జె. జె. అబ్రమ్స్ ముందుంటారు.. ఆ తర్వాత క్వాంటిన్ టరాన్‌టినో ఉంటారని చెప్పారు. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీస్‌లో ఆయన తెరకెక్కించిన ఇన్‌గ్లోరియస్ బాస్టర్డ్స్ ఒకటని చెప్పారు చరణ్. ఆయన ప్రభావం తనపై చాలా ఉందని తెలిపారు. వారిద్దరు డైరెక్టర్లు వారితో పని చేసే నటులకు సవాలు విసురుతుంటారని చెప్పారు చరణ్.
ఆస్కార్ వేడుకలో పాల్గొనే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు రామ్ చరణ్. మరోవైపు కాస్త టెన్షగా ఉందని చెప్పారు. తాను అభిమానించే తారలంతా ఆ ఈవెంట్‌కు వస్తున్నారు… అక్కడ తాను అభిమానిగా ప్రవర్తిస్తానో, ఓ నటుడిగా ఉంటానో చూడాలన్నారు. టామ్‌క్రూజ్ చాలా గొప్ప వ్యక్తి. ఆస్కార్ అవార్డుకి తమ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి అర్హులు. 27 ఏళ్ల ప్రస్థానం ఆయనదని .. కీరవాణిని సపోర్ట్ చేయడానికి ఓ కుటుంబంలా మేమంతా ఇక్కడకు వచ్చామని చెప్పారు చరణ్.