Rajitha Chanti |
Updated on: Mar 10, 2023 | 1:24 PM
తెలుగు ప్రేక్షకులకు ప్రియాంక జవాల్కర్ సుపరిచితమే. విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా సినిమాతో వెండితెరకు పరిచమయైంది ఈ ముద్దుగుమ్మ.
తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ప్రియాంక.. ఆ తర్వాత తిమ్మరసు చిత్రంలో కనిపించింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం జోడిగా ఎస్ఆర్. కళ్యాణమండపం చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ ఇందుకుంది.
ఆ తర్వాత గమనం చిత్రంలో నటించి మెప్పించింది. అయితే అందం, అభియనంతో ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ ఇప్పటికీ స్టార్ కాలేకపోయింది. గతేడాది ఒక్క సినిమా కూడా చేయలేదు.
అటు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయ్యింది. తాజాగా ప్రియాంక్ లక్కీ ఛాన్స్ అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఏకంగా నందమూరి హీరో సినిమాలో ఆఫస్ వచ్చిందట.
బాలయ్య కథానాయుకుడిగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది. ఇందులో కథానాయిక రోల్ కోసం ప్రియాంకను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.
దీనిపై త్వరలోనే ప్రకటన రానుందట. ఒకవేళ ఈ సినిమాలో ప్రియాంక నటిస్తే .. ఆ తర్వాత వరుస అవకాశాలతో బిజీగా మారడం ఖాయమంటున్నారు అభిమానులు.
లక్కీ ఛాన్స్ కొట్టేసిన టాక్సీవాలా బ్యూటీ.. నందమూరి హీరో సరనస ప్రియాంక జవాల్కర్.. ?