Ram Charan: అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ సిగ్నెచర్ ఎలా ఉంటుందో చూశారా.. ?

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చరణ్.. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Ram Charan: అభిమానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్ సిగ్నెచర్ ఎలా ఉంటుందో చూశారా.. ?
Ram Charan
Follow us

|

Updated on: Oct 15, 2024 | 11:46 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇఫ్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యా్న్స్ ఉన్న టాలీవుడ్ హీరో. మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన చెర్రీ.. సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారారు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ చరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన చరణ్.. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో రామ్ చరణ్ సిగ్నెచర్ ఫోటో వైరల్ అవుతుంది. గతంలో చరణ్.. ఢిల్లీలో నిర్వహించిన హిందుస్తాన్ టైమ్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‏తో కలిసి వచ్చి సందడి చేశాడు చరణ్. ఇద్దరూ బాలీవుడ్.. టాలీవుడ్ పాటలకు తమ స్టైల్లో స్టెప్పులేసి అలరించారు. ఇక అనంతరం తమ కోసం వచ్చిన అభిమానులను కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు అభిమానులకు సెల్ఫీలతోపాటు.. ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు రామ్ చరణ్.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో ఓ మహిళా అభిమానికి చెర్రీ ఇచ్చిన సిగ్నెచర్ ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న చరణ్ ను మిస్ ఇండియా రన్నరప్ రుషాలి రాయ్ కలిసింది. చెర్రీతో ఫోటో తీసుకుని.. ఆటోగ్రాఫ్ తీసుకుని తెగ మురిసిపోయింది. అనంతరం తన అభిమాన హీరోతో కలిసి దిగిన ఫోటోలను .. ఆటోగ్రాఫ్ ను రుషాలి తన ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ సంతోషపడిపోయింద. అందులో చరణ్. ఆల్ ది బెస్ట్ రుషాలి అని చెబుతూ సిగ్నెచర్ చేశారు చరణ్. చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి చెర్రీ సిగ్నేచర్ ఫోటోను ఫ్యాన్స్ మళ్లీ వైరల్ చేస్తున్నారు.

Ram Charan

Ram Charan

View this post on Instagram

A post shared by Rushali Rai (@rrushali03)

ఇది చదవండి: ‘అమ్మాయిలు అబ్బాయిలు’ మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఆమె భర్త ఫేమస్ హీరో.. ఫోటోస్ వైరల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.