RRR Movie: “RRR” మూవీపై క్రేజీ అప్‌డేట్.. దీపావళికి ముందే ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్..
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చేప్పించే ప్రయత్నం చేస్తున్నారు..
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చేప్పించే ప్రయత్నం చేస్తున్నారు జక్కన్న. ఈ మూవీలో కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండగా.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నాడు . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్‌గా మారిపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్స్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే శుక్రవారం ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయనున్నారని అనౌన్స్ చేశారు చిత్రయూనిట్. శుక్రవారం ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ విడుదల చేయాల్సి ఉంది. అయితే దానిని వాయిదా వేశారు మేకర్స్.
తాజాగా ఈ గ్లింప్స్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌ను నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శుక్రవారం ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ విడుదల చేయాల్సి ఉంది. అయితే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో కన్నడ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గుండెపోటు రావడంతో పునీత్ కుప్పకూలిపోయారు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తుండగా పునీత్ కన్నుమూశారు. పునీత్ మరణం పై సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆర్ఆర్ఆర్ గ్లింప్స్ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇక నవంబర్ 1న ఉదయం 11 గంటలకు గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :