Jr NTR – Puneeth Rajkumar: కుటుంబ సభ్యులకు ఓదార్పు.. పునీత్ రాజ్‌కుమార్‌కు ఎన్టీఆర్ కడసారి నివాళి..
శాండల్‌వుడ్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖ కళాకారులు, సాంకేతిక నిపుణులు పునీత్‌కు నివాళులర్పించారు. బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్న జూ.ఎన్టీఆర్ వచ్చి పునీత్‌కు నివాళులర్పించారు.
శాండల్‌వుడ్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. పలువురు ప్రముఖ కళాకారులు, సాంకేతిక నిపుణులు పునీత్‌కు నివాళులర్పించారు. పునీత్ రాజ్‌కుమార్‌కు కడసారి నివాళి అర్పించేందుకు టాలీవుడ్ క్యూ కట్టింది. బెంగళూరు కంఠీరవ స్టేడియం చేరుకున్న జూ.ఎన్టీఆర్ వచ్చి పునీత్‌కు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదర్చారు. శివరాజ్ కుమార్ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. శాండల్‌వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిర్గందూర్ కూడా నివాళులర్పించారు.
అంతకుముందు నటులు నందమూరి బాలకృష్ణ, ప్రభుదేవా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలకృష్ణ.. ‘నా సోదరుడిని పోగొట్టుకున్నాను అంటూ బాలకృష్ణ పునీత్‌కు కడసారి నివాళి అర్పించిన సంగతి తెలిసిందే. పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ను హత్తుకొని ఓదార్చారు.
పునిత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై. అభిమానులు ప్రశాంతంగా ఉండాలని కోరారు. పునిత్ సోదరి రాక ఆలస్యం అవుతున్న కారణంగా.. కుటుంబ సభ్యులతో కలసి తామీ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు కర్ణాటక సీఎం బసవరాజ్.
అప్పుగా అశేష కన్నడ ప్రేక్షకాదరణ..
చరిత్రలో తొలిసారి ఒక నటుడి మరణం. అతడి సినిమాలతో కాకుండా.. అతడు చేసిన మంచి పనులతో నివాళి దక్కించుకోవడం.. గొప్ప విషయం.. అతడు మరెవరో కాదు.. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్. తన సినిమాలకన్నా మించిన సేవాగుణమే అతడ్ని మిగిలిన వారికంటే అందనంత ఎత్తున నిలపడం కన్నడ చిత్రసీమకే గర్వకారణం.. మానవత్వానికే నిలువెత్తు నిదర్శనం.
పునీత్ మరణ వార్త చెప్పడానికి కర్ణాటక ప్రభుత్వమే భయపడిపోయింది. పరీక్షలు రాసేవాళ్లను సైతం ఇళ్లకు పంపించేసి.. స్కూళ్లకు సెలవులిచ్చేసి.. కేంద్ర హోంశాఖను అడిగి కేంద్ర బలగాలను పంపించమని కోరి.. ఆ తర్వాతగానీ విషాద వార్త ప్రకటించలేదు. అంతటి పాపులర్ హ్యూమన్ బీయింగ్ పునీత్ రాజ్ కుమార్.
ఇవి కూడా చదవండి: PM Modi Meets Pope: వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన భారత ప్రధాని మోడీ..