Kajal Aggarwal: పెళ్లి రోజున భర్తతో ఉన్న అందమైన ఫోటో షేర్ చేసిన చందమామ కాజల్

చందమామ కాజల్ గత ఏడాది దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో స్నేహితుడైన గౌతమ్ కిచ్లూతో ఆమె ఏడడుగులు వేసింది.

Kajal Aggarwal: పెళ్లి రోజున భర్తతో ఉన్న అందమైన ఫోటో షేర్ చేసిన చందమామ కాజల్
Kajal Agarwal
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 30, 2021 | 3:36 PM

చందమామ కాజల్ గత ఏడాది దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎప్పటి నుంచో స్నేహితుడైన గౌతమ్ కిచ్లూతో ఆమె ఏడడుగులు వేసింది. సరిగ్గా ఇదే రోజున(అక్టోబర్ 30) అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య కాజల్ పెళ్లి జరిగింది. కరోనా సమయం కావడం,  ఆంక్షలు ఉండటంతో కాజల్ సెలబ్రిటీలను వివాహానికి పిలువలేదు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే కాజల్ పెళ్లికి సంబంధించిన న్యూస్, ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. మెహందీ వేడుకలు దగ్గరనుంచి.. పెళ్లి చీర, నగల గురించి వార్తలు తెగ సర్కులేట్ అయ్యాయి. అయితే మొత్తానికి కాజల్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. తన పెళ్లై ఏడాది అయిన సందర్బంగా కాజల్ ఇన్‌స్టా వేదికగా స్పెషల్ పిక్ షేర్ చేసింది.  అలానే భర్తకు సంబంధించిన ఓ విషయాన్ని కూడా చెప్పింది. అర్దరాత్రి కాజల్ భర్త గొనుగుతాడట. నిద్ర లేచే ఉన్నావా? నీకు ఈ డాగ్ వీడియో చూపించాలి అని అంటాడట. ఈ విషయాన్ని కాజల్ రాసుకొచ్చింది. హ్యాపీ వెడ్డింగ్ యానీవర్సరీ అంటూ తన భర్తతో ఉన్న ఓ అందమైన ఫోటోను ఆమె షేర్ చేసింది.

కాజల్ పెళ్లి రోజు కావడంతో.. ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిండు నూరెళ్లు ఈ జంట హ్యాపీగా, అన్యోన్యంగా జీవించాలని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Andhra Pradesh: కన్నీరు పెట్టించే ఘటన.. భార్య మృతదేహంపై పడి రోదిస్తూ భర్త మృతి