AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakesh Master: మా నాన్న చెడిపోవడానికి వారే కారణం.. రాకేష మాస్టర్‌ కుమారుడి సంచలన వ్యాఖ్యలు

తన డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మాస్టర్ అయితే ఎందుకో గానీ సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు మాస్టర్‌. అదే సమయంలో కొన్ని యూట్యూఛ్‌ చానెళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు.

Rakesh Master: మా నాన్న చెడిపోవడానికి వారే కారణం.. రాకేష మాస్టర్‌ కుమారుడి సంచలన వ్యాఖ్యలు
Rakesh Master Son
Basha Shek
|

Updated on: Jun 23, 2023 | 5:12 PM

Share

టాలీవుడ్ కొరియో గ్రాఫర్‌ రాకేష్‌ మాస్టర్‌ హఠాన్మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా టాలీవుడ్‌లో 1500కు పైగా సినిమాలకు కొరియోగ్రఫీ అందించిన ఘనత రాకేష్‌ మాస్టర్‌ సొంతం. ప్రభాస్‌, మహేశ్‌ బాబు, రవితేజ తదితర స్టార్‌హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా సేవలందించారాయన. ఇక ప్రస్తుతం తెలుగు సినిమాలో టాప్‌ కొరియోగ్రాఫర్లుగా వెలుగొందుతోన్న శేఖర్‌, జానీ మాస్టర్లు రాకేష్‌ మాస్టర్‌ దగ్గర డ్యాన్స్‌ పాఠాలు నేర్చుకున్నవారే. ఇలా తన డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌తో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మాస్టర్ అయితే ఎందుకో గానీ సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమయ్యారు మాస్టర్‌. అదే సమయంలో కొన్ని యూట్యూఛ్‌ చానెళ్లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ కారణంగానే సినిమా పరిశ్రమ రాకేష్‌ మాస్టర్‌ను దూరం పెట్టిందనే ప్రచారమూ ఉంది. ఇందులో నిజమేదో, అబద్ధమేదో తెలియదు కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన రాకేష్‌ మాస్టర్‌ ఆఖరి దశలో మాత్రం ఎన్నో ఇబ్బందులు పడ్డారనేది ఎవరూ కాదనలేని నిజం. ఈక్రమంలోనే మాస్టర్‌ తనయుడు చరణ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. తన తండ్రి దిగజారిపోవడానికి కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ కారణమంటూ అతను చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.

మా నాన్న ఇలా అవ్వడానికి సోషల్‌ మీడియానే కారణం. కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌ లబ్ధి పొందేందుకు ఆయనను ఉపయోగించుకున్నాయి. ఆ తర్వాత నాన్నపై పూర్తి నెగెటివిటీని చూపించాయి. ఇకనైనా అలాంటి వీడియోలు ఆపేయండి. ఇప్పటివరకు మా ఫ్యామిలీని మీడియాలో ఎక్స్‌పోజ్‌ చేసి బాధపెట్టింది చాలు. దయచేసి మా జీవితాలను మరింత చీకట్లోకి లాగకండి. ఇకపై మా జీవితాల్లోకి వస్తే మాత్రం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాను’ అని రాకేష్‌ మాస్టర్‌ కుమారుడు ఎంతో ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి