Lal Salaam Review: రజనీకాంత్ ‘లాల్ సలామ్’ రివ్యూ.. తలైవా మరో హిట్టు కొట్టినట్టేనా?

జైలర్ లాంటి సినిమా తర్వాత రజినీకాంత్ నుంచి వచ్చిన సినిమా లాల్ సలామ్. పైగా ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడంతో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ట్రైలర్‌లో హిందూ ముస్లిమ్ గొడవలనే ఎక్కువగా చూపించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Lal Salaam Review: రజనీకాంత్ 'లాల్ సలామ్' రివ్యూ.. తలైవా మరో హిట్టు కొట్టినట్టేనా?
Lal Salaam Movie
Follow us

| Edited By: Basha Shek

Updated on: Feb 09, 2024 | 9:13 PM

సినిమా రివ్యూ: లాల్ సలామ్ నటీనటులు: రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత రాజశేఖర్, సెంథిల్ కుమార్ తదితరులు సినిమాటోగ్రఫీ: విష్ణు రంగసామి కథ: విష్ణు రంగసామి, ఐశ్వర్య రజనీకాంత్ సంగీతం: ఏఆర్ రెహమాన్ దర్శకత్వం: ఐశ్వర్య రజనీకాంత్

జైలర్ లాంటి సినిమా తర్వాత రజినీకాంత్ నుంచి వచ్చిన సినిమా లాల్ సలామ్. పైగా ఈ సినిమాకు ఆయన కూతురు ఐశ్వర్య దర్శకురాలు కావడంతో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ట్రైలర్‌లో హిందూ ముస్లిమ్ గొడవలనే ఎక్కువగా చూపించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఇవి కూడా చదవండి

బాబ్రీ మసీద్ ఘటన తర్వాత 1993లో జరిగే కథ ఇది. కసుమూరు అనే ఊళ్లో హిందువులు, ముస్లింలు ఒక తల్లి పిల్లల్లా ఐకమత్యంగా కలిసుంటారు. వాళ్లకు మొయిద్దీన్ భాయ్ (రజినీకాంత్) అన్ని విధాల అండగా ఉంటాడు. బాయ్ కొడుకు శంషుద్దీన్‌ (విక్రాంత్) క్రికెటర్. ఎప్పటికైనా ఇండియాకు ఆడాలనేది ఆయన కల. అయితే ఒక మ్యాచ్ సందర్భంగా గురు (విష్ణు విశాల్) భాయ్ కొడుకు షంషూను కొట్టడంతో రెండు మతాల మధ్య గొడవలు వస్తాయి. అవి కాస్తా హిందూ ముస్లిమ్ గొడవలకు మారతాయి. అయితే ఒకప్పుడు గురు (విష్ణు విశాల్) తండ్రి (ఫిలిప్ లివింగ్‌స్టోన్ జోన్స్), మొయిద్దీన్ భాయ్ ప్రాణ స్నేహితులుగా ఉంటారు. తన కొడుకు షంషూతో పాటు గురును కూడా సొంత కొడుకుగానే చూస్తాడు భాయ్. కానీ మత కల్లోలాలతో ఇద్దరూ దూరం అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు గురు, శంషుద్దీన్‌ల మధ్య గొడవకు అసలు కారణం ఏంటి? అనేది పూర్తి కథ..

కథనం:

ముందు నుంచి చెప్తున్నట్లు లాల్ సలామ్ గొప్ప కథేం కాదు.. ఇదివరకు ఎన్నో సినిమాల్లో చూసిన మామూలు హిందూ ముస్లిమ్ కథే. కాకపోతే దానికి క్రికెట్ నేపథ్యాన్ని కూడా జోడించింది ఐశ్వర్య రజినీకాంత్. రెండు మతాలను రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడం కోసం ఎలా వాడుకున్నారు అనేది ఈ సినిమాలో ఎక్కువగా చూపించింది దర్శకురాలు. దానికి ఊరు నేపథ్యం.. గ్రామంలో ఉండే జాతర.. అమ్మవారితో లింక్ పెట్టి రూరల్ డ్రామాగా తెరకెక్కించింది ఐశ్వర్య. రజనీకాంత్ పాత్రను కూడా జాగ్రత్తగా వాడుకున్నారు మేకర్స్. ఆయనది అతిథి పాత్రలా కాకుండా సినిమా అంతా ఉండేలా చూసుకుంది ఐశ్వర్య. ముఖ్యంగా అతడి పాత్రను ఎక్కడా కాంట్రవర్సీకి తావు లేకుండా జాగ్రత్త పడింది. సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. ఒక ఊరిలో ఓట్ల కోసం రాజకీయ నాయకుల ఎత్తులు పై ఎత్తులు, ఊరి జనం నుంచి విష్ణు విశాల్ తప్పించుకోవడానికి ప్రయత్నించడం చూసాక ఏదో ఉంటుందనే ఆసక్తి మొదలవుతుంది. కానీ ఆ తర్వాత అదే రేంజ్ క్యూరియాసిటీ మెయింటేన్ చేయలేకపోయింది ఐశ్వర్య. దానికి తోడు హీరోయిన్ లవ్ ట్రాక్, జాతర పాట అవన్నీ పెద్దగా కిక్ ఇవ్వవు. రజినీకాంత్ ఉన్నా కూడా పవర్ ఫుల్ సీన్స్ ఒక్కటి కూడా పడలేదు. తమ ఊళ్లో జాతర కోసం వేరే ఊరి నుంచి అరువు తెచ్చుకున్న తేరును జాతర జరక్కుండానే తీసుకెళ్లడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ కూడా ఎక్కువగా తేరు చుట్టూనే తిరుగుతుంది. ఈ క్రమంలో మెయిన్ స్టోరీ పక్కకు వెళ్లిపోతుంది. విష్ణు విశాల్ కారెక్టరైజేషన్ విషయంలో ఐశ్వర్య ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. అలాగే అతడి అమ్మగా నటించిన జీవిత రోల్ కూడా ఏమంత కన్విన్సింగ్‌గా ఉండదు. ఒకానొక సమయంలో ‘నువ్వు చచ్చిపోతే నేను సంతోషిస్తాన్రా’ అని హెవీ ఎమోషనల్ డైలాగులు చెప్పిన అమ్మ.. కొడుకు డబ్బులు సంపాదించిన నెక్ట్స్ సెకండ్ నుంచి ప్రేమగా మాట్లాడుతుంది. అదేం లాజిక్ అర్థం కాదు. హిందు ముస్లిమ్ గొడవలపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు అనిపించినా.. మధ్యలో వచ్చే క్రికెట్, రూరల్ డ్రామా ఇవన్నీ మెయిన్ స్టోరీని పక్కదారి పట్టించేసాయి. అక్కడక్కడా మంచి సీన్స్ పడినా కూడా సినిమాను నిలబెట్టేలా మాత్రం లేవు.

నటీనటులు:

ముందు నుంచి ఈ సినిమాలో రజనీకాంత్ అతిథి పాత్ర చేసాడేమో అనుకున్నారు. కానీ అలా ఏం కాదు.. ఓ సినిమాలో హీరోకు ఎంత నిడివి ఉండాలో అంతా ఉంది. ఆయన్ని సరిగ్గా వాడుకోవడంలో ఐశ్వర్య రజినీకాంత్ ఫెయిల్ అయింది. ఇక రజినీ తర్వాత విష్ణు విశాల్ కీలక పాత్ర చేసాడు. విక్రాంత్ కంటే చాలా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఈయనకే ఉంది. విక్రాంత్ కూడా ఉన్నంతలో బాగానే నటించాడు. జీవితకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర దొరికింది. ఇక చాలా కాలం తర్వాత సీనియర్ కమెడియన్ సెంథిల్ స్క్రీన్ మీద కనిపించారు. అనంతిక పాత్ర చిన్నదే. మిగతా వాళ్లందరూ ఓకే..

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు సంగీత దర్శకుడు రెహమాన్ అనే సంగతి చెప్తే కానీ తెలియదు. చిన్న సినిమా అనుకున్నాడో ఏమో కానీ అంతగా మ్యూజిక్ అయితే ఆకట్టుకునేలా ఇవ్వలేదు రెహమాన్. సినిమాటోగ్రాఫర్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. అయితే చాలా సీన్స్ ఎడిట్ చేయొచ్చు కానీ డైరెక్టర్ ఛాయిస్ కాబట్టి అతడి పనితీరు తక్కువ చేయలేం. దర్శకురాలిగా ఐశ్వర్య రజినీకాంత్ మరోసారి సగమే సక్సెస్ అయ్యారు. మంచి కథ తీసుకున్నా.. దాన్ని సరిగ్గా డీల్ చేయలేదు. సరిగ్గా డీల్ చేసుంటే లాల్ సలామ్ నిజంగానే ఇంకా మంచి సినిమా అయ్యుండేది.

పంచ్ లైన్:

లాల్ సలామ్.. రజినీ మాత్రమే రక్షకుడు.. అందరూ సలామ్ చేయడం కష్టమే..