Lal Salaam OTT: డబుల్ ధమాకా.. రెండు ఓటీటీల్లో రజనీకాంత్ లాల్ సలామ్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న రిలీజైన లాల్ సలామ్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. వసూళ్ల పరంగానూ లాల్ సలామ్ నిర్మాతలకు నిరాశే మిగిలింది. అయితే రజనీకాంత్ క్యారెక్టర్, అతని యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు బాగా నచ్చుతాయని రివ్యూలు చెప్పేశాయి.

‘జైలర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన చిత్రం లాల్ సలామ్. రజనీ గారాల పట్టి ఐశ్వర్య దర్శకత్వం వహించిన ఈ స్టోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాలో యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న రిలీజైన లాల్ సలామ్ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ పెద్దగా ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. వసూళ్ల పరంగానూ లాల్ సలామ్ నిర్మాతలకు నిరాశే మిగిలింది. అయితే రజనీకాంత్ క్యారెక్టర్, అతని యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు బాగా నచ్చుతాయని రివ్యూలు చెప్పేశాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించలేకపోయిన లాల్ సలామ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. రజనీకాంత్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌తో పాటు సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రెండు ఓటీటీలలో ఒకే రోజు లాల్ సలామ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. నెట్‌ఫ్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో రజనీకాంత్ మూవీ రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే సన్ నెక్స్ట్‌లో కేవలం తమిళ వెర్షన్ మాత్రం అందుబాటులోకి రానుంది. మార్చి 9 నుంచి లాల్ సలామ్ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. మరో 2,3 రోజుల్లో లాల్ సలామ్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమా రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. లివింగ్ స్టన్, సెంతిల్, తంబి రామయ్య, నిరోషా, వివేక్ ప్రసన్నా, ధన్యా బాలకృష్ణ, తంగదురై తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. ఒక గ్రామంలో జరిగిన హిందూ- ముస్లిం గొడవలకు కాస్త క్రికెట్ నేపథ్యాన్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారు రజనీకాంత్ ఐశ్వర్య. ఇందులో మొయీద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ అభిమానులను మెప్పించారు.
మళ్లీ కలిసిన లాల్ సలామ్ టీమ్..
மக்களின் பேரன்பிற்கும், பேராதரவிற்கும் நன்றி!!! 🙏🏻😇 Successful 2 weeks of LAL SALAAM, into the 3rd week today! 📽️✨#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran… pic.twitter.com/fcCdDYDmMu
— Lyca Productions (@LycaProductions) February 23, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








