Rajinikanth: ఆసుపత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్.. ప్రధానికి థాంక్స్ చెప్పిన తలైవా..

సౌత్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుని గురువారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన అభిమానులను, శ్రేయోభిలాషులను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు.

Rajinikanth: ఆసుపత్రి నుంచి రజినీకాంత్ డిశ్చార్జ్.. ప్రధానికి థాంక్స్ చెప్పిన తలైవా..
Supar Star Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 04, 2024 | 7:42 PM

సౌత్ ఇండస్ట్రీ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుని గురువారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన అభిమానులను, శ్రేయోభిలాషులను ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పారు. “నేను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు నేను త్వరగా కోలుకోవాలని కోరుకున్న రాజకీయ మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పత్రికా మిత్రులకు, నా మంచి కోరుకునే సన్నిహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కోలుకున్నాను. నా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ” పేర్కొన్నారు. తాను తొందరగా కోలుకోవాలని ప్రార్థించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కు కృతజ్ఞతలు చెప్పారు.

రజినీకాంత్ సెప్టెంబర్ 30న చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు.. ట్రాన్స్ కాథేటర్ పద్దతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. గత 3 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రజినీ ఇప్పుడు కోలుకుని ఇంటికి చేరుకున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో నిన్న రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చినట్లు సమాచారం. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. రజినీ ఆసుపత్రిలో ఉన్న సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుందగై, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ప్రధాని మోదీతో పాటు ఇతర రాజకీయ పార్టీల నేతలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ఆయన కోలుకోవాలంటూ పోస్టులు చేశారు.

రజినీ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ T. S. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నాడు రజినీ. ఈ మూవీ అక్టోబర్ 10 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రితికా సింగ్, మంజు వారియర్, రక్షణ, తుషార విజయన్, భగత్ బాసిల్, రానా దగుపతి తదితరులు నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా ట్రైలర్ అక్టోబర్ 2న విడుదలైంది. అలాగే కూలీ చిత్రంలో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
పుష్పాగాడి రూల్.. 2000 కోట్ల క్లబ్ లో పుష్ప 2.! బన్నీ మార్క్ సెట్
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
ఇకపై గంటలో తిరుమల వెంకన్న దర్శనం.. ఎలాగంటే?
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్