Rajinikanth: బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్.. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రజినీ లైఫ్ స్టోరీ

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు రజినీకాంత్. సాధారణ బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. నటుడిగా కోట్లాది మంది ప్రజల స్థానం సంపాదించుకున్న రజినీ సినీ ప్రయణం ఎప్పుడూ అంత సులభం కాదు. ఈరోజు సూపర్ స్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రజినీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

Rajinikanth: బస్ కండక్టర్ నుంచి సూపర్ స్టార్.. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రజినీ లైఫ్ స్టోరీ
Supar Star Rajinikanth
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2024 | 8:10 AM

సినిమా ఎంతో మందికి కల. వెండితెరపై తమదైన నటనతో మాయ చేసే అదృష్టం కొందరికే దక్కుతుంది. ఇప్పటివరకు సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఒక్కొక్కరిది ఒక్కో కథ. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినవాళ్లు కొందరు.. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చినవారు మరికొందరు. కానీ ఒక్కరోజులోనే సినిమా ఇండస్ట్రీని మార్చేసిన నటుడు రజినీకాంత్. సాధారణ బస్ కండక్టర్ నుండి భారతీయ చలనచిత్రంలో సూపర్ స్టార్ స్థాయికి ఎదిగారు రజినీ. ఆయన సినీ ప్రయాణం ఎప్పుడూ అంత సులభం కాదు. ఎన్నో అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. అతను అనుభవించిన విషయాలే నేటికీ సాధారణ వ్యక్తిగా జీవించేలా ప్రేరేపిస్తాయి.

శివాజురావు రజనీకాంత్ కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని నాచికుప్పం అనే గ్రామానికి వలస వెళ్లిన మరాఠా కుటుంబంలో జన్మించారు. అనంతరం తమిళనాడులో సెటిల్ అయ్యారు. రజనీకాంత్‌కి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనేది పెద్ద కల. బెంగళూరులోని ఆచార్య అకాడమీ, వివేకానంద బాలక్ సంఘ్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. సినిమాల్లో నటించాలని చెన్నై వెళ్లాడు. కానీ అక్కడ ఎలాంటి దొరక్కపోవడంతో రజనీ సినిమాపై ఉన్న మక్కువను వదులుకుని వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. రజనీ కల సినిమా అయితే.. ఉద్యోగం దొరికితే ఇంటి కష్టాలు తీరుతాయని కుటుంబం భావించింది. అప్పుడే కర్ణాటక ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో బస్ కండక్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్నారు రజినీ. అదే సమయంలో నాటకాల్లో నటించేందుకు సమయం దొరికింది.

యాక్టింగ్ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. కానీ అప్పుడు కుటుంబం అతడిని ప్రోత్సహించలేదు. రజనీకాంత్ కె బాలచంద్రన్ దర్శకత్వం వహించి ఆగస్ట్ 18, 1975న విడుదలైన అపూర్వరాగమల్ చిత్రంతో పెద్ద తెరపై అరంగేట్రం చేశారు. కమల్ హాసన్, శ్రీవిద్య, జయసుధలతో కలిసి నటించారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలు పోషించాడు. బాలచందర్ నిర్మించిన నేత్రికాన్ రజనీ లక్కీ స్టార్ ను చేసింది. ఈ సినిమా తర్వాతే తన పేరును శివాజీరావు గైక్వాడ్ నుంచి రజినీకాంత్ గా మార్చారు డైరెక్టర్ బాలచందర్. ఆ తర్వాత దళపతి, మన్నన్, పాండియన్, బాషా, ముత్తు, పడయప్ప, అరుణాచలం సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగాడు. రజనీకి ప్రత్యామ్నాయం రజనీ ఒక్కరే అని సినీ పరిశ్రమ మొత్తం చెప్పుకునేలా ఇమేజ్ సంపాదించాడు.

ఇవి కూడా చదవండి

తెలుగు, మలయాళం, హిందీ, బెంగాలీ, కన్నడ భాషలలో నటించారు. 2002 ఏడాది రజినీకి కలిసిరాలేదు. వరుసగా ప్లాప్స్ అందుకున్నారు. దీంతో ఆయన శకం ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మూడేళ్లకు విడుదలైన చంద్రముఖి సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలతో అలరిస్తున్నాడు రజినీ. ఆయన స్టైల్, స్వాగ్, డైలాగ్స్ అంటే సినీ అభిమానులకు పిచ్చి. 2000లో పద్మభూషణ్‌, 2016లో పద్మవిభుషన్ అందుకున్నారు. ఆసియావీక్ మ్యాగజైన్ ద్వారా దక్షిణాసియాలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా, ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ద్వారా భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేర్కొన్నాడు. దాదాసాహెబ్ ఫాక్ అవార్డు కూడా అందుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.