Mohanbabu: టీవీ9 రిపోర్టర్ పై దాడి.. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు..
టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై దాడి చేసిన మోహన్‌బాబుకు ఊహించని షాకిచ్చారు పోలీసులు. నిన్న కేవలం 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేశారు. జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో లీగల్ ఒపీనియన్‌కి వెళ్లిన రాచకొండ పోలీసులు..
టీవీ9 ప్రతినిధి రంజిత్‌పై దాడి చేసిన మోహన్‌బాబుకు ఊహించని షాకిచ్చారు పోలీసులు. బుధవారం కేవలం 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈరోజు ఎఫ్‌ఐఆర్‌లో మార్పులు చేశారు. జర్నలిస్టు సంఘాల ఆందోళనలతో లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ ను మార్చిన రాచకొండ పోలీసులు.. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ రంజితపై దాడి ఘటనలో BNS 109 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తన పాప ఇంట్లో ఉందని… తన భార్యతో కలిసి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు మంచు మనోజ్. దీంతో అతడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీతో వాగ్వాదానికి దిగిన మనోజ్ గేట్లు తోసుకుని మరీ ఇంట్లోకి వెళ్లారు. అదే సమయంలో మోహన్ బాబు ఇంటి నుంచి బయటకు వచ్చారు.
ఈ క్రమంలో కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ చేతిలోని మైక్ తీసుకుని అతడిపై బలంగా దాడి చేశాడు. ఈ ఘటనలో టీవీ9 రిపోర్టర్ రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కంటికి, చెవికి మధ్య మూడు లెవల్స్ లో ఫ్రాక్చర్ అయ్యిందని.. సెన్సిటివ్ జైగోమాటిక్ ఎముక విరగడంతో అతడికి బుధవారం సర్జరీ చేశారు వైద్యులు.
రంజిత్ పై దాడి మోహన్ బాబు దాడి చేయడంపై జర్నలిస్ట్ లోకం భగ్గుమంది. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలతో హోరెత్తించాయి. మీడియా ప్రతినిధులపై దాడి చేసిన మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు లీగల్ ఒపీనియన్ కు వెళ్లి సెక్షన్ మార్చి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.