AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Sipligunj Marriage: పెళ్లి చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. హైదరాబాద్‌లో ఘనంగా వివాహం

ఆస్కార్‌ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ పెళ్లి పీటలెక్కారు. గురువారం తెల్లవారుజామున తన ప్రేయసి హరిణ్య మెడలో మూడుముళ్లు వేనన రాహుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Rahul Sipligunj Marriage: పెళ్లి చేసుకున్న సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. హైదరాబాద్‌లో ఘనంగా వివాహం
Rahul Sipligunj Weds Harinya (1)
Anand T
|

Updated on: Nov 27, 2025 | 5:07 PM

Share

ఆస్కార్‌ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ పెళ్లి పీటలెక్కారు. గురువారం తెల్లవారుజామున తన ప్రేయసి హరిణ్య మెడలో మూడుముళ్లు వేనన రాహుల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు అభిమానులు కొత్తజంటలకు శుభాకంక్షలు తెలుపుతున్నారు.

వీడియో చూడండి..

అయితే గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న రాహుల్, హరిణ్య ఇద్దరూ వాళ్ల వాళ్ల పెద్దలను ఒప్పించి ఆగస్టు 17న నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా గురువారం తెల్లవారుజామున పెళ్లి బంధంలో ఒక్కటై కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. హైదరాబాద్‌లోని ఓల్డ్‌ సిటీలో పుట్టి పెరిగిన రాహుల్.. తన అద్బుతమైన వాయిస్‌తో ఇటు తెలంగాణ ఫోక్‌ సాంగ్స్, మాస్ సాంగ్స్‌తో మంచి పేరు సంపాధించుకన్నాడు. తర్వాత బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా విన్నర్‌గా నిలిచి మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత ఎన్నో ఫోక్ సాంగ్స్, మూవీ సాంగ్స్‌ పాడిన రాహుల్‌కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి త్రిబుల్‌ ఆర్ సినిమాలో పాటపాడే చాన్స్ దక్కింది. ఈ సినిమాలో రాహుల్ పాడిన నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్‌ అవార్డే దక్కింది. దీంతో హైదరాబాద్‌లోని గల్లీలో నుంచి రాహుల్ ప్రపంచంలో అత్యున్నత వేదికపై వినిపించింది. ఆస్కార్ అవార్డు నెగ్గిన రాష్ట్రానికి పేరు తెచ్చి పెట్టిన రాహుల్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల రివార్డ్ ను కూడా ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us