Pawan Kalyan: వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.. పవన్‌ను తల్చుకుంటూ గాల్లో తేలిపోతున్న రచ్చ రవి.. ఏమైందంటే?

ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులతో పాటు స్టార్ హీరోలు, యువ కథానాయకులు కూడా ఆయనను అమితంగా అభిమానిస్తారు. అలా పవన్ కల్యాణ్ వీరాభిమానుల్లో స్టార్ కమెడియన్ రచ్చ రవి కూడా ఉన్నాడు.

Pawan Kalyan: వెయ్యి ఏనుగుల బలం వచ్చింది.. పవన్‌ను తల్చుకుంటూ గాల్లో తేలిపోతున్న రచ్చ రవి.. ఏమైందంటే?
Pawan Kalyan, Racha Ravi
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2025 | 4:32 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అలాగే అంజలి, శ్రీకాంత్, ఎస్ జే సూర్య, జయరాం, సునీల్, రచ్చ రవి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్లలో భాగంగా శనివారం (జనవరి 04న) రాజమండ్రి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ చిత్ర బృందంతో పాటు కార్యక్రమానికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియజేశారు. ఈ క్రమంలోనే గేమ్ ఛేంజర్ సినిమా టీమ్ పేర్లు చెబుతున్న సందర్భంలో రచ్చ రవి పేరు సరిగ్గా పలకలేకపోయారు. రచ్చ.. రవి అంటూ గ్యాప్ ఇస్తూ రెండు మూడు సార్లు పలికారు. అలాగే రచ్చ రవి ఎక్కడ ఉన్నాడోనంటూ వేదిక చుట్టు పక్కల వెతికాడు. అయితే ఈ స్టార్ కమెడియన్ చుట్టు పక్కల కనిపించలేదు. అయినా రచ్చ రవి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కల్యాణ్.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ నోటి వెంట తన పేరు రావడంపై రచ్చ రవి ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడీ స్టార్ కమెడియన్. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ తన పేరు పలుకుతున్నప్పటి వీడియోను షేర్ చేస్తూ.. ‘పవర్ ఫుల్ పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నోట ఓ చిన్న రచ్చ అన్న మాట .. ఈ జిందగీలో వెయ్యి ఏనుగుల బలం.. ఈ జీవితానికి అద్భుతమైన నాకు ఇచ్చిన జ్ఞాపకం’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

రచ్చ రవి షేర్ చేసిన వీడియో..

గేమ్ ఛేంజర్ సినిమాలో రచ్చ రవి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ బహిష్కరణకు బ్రిటిష్ నేతల డిమాండ్
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
ఎట్టకేలకు పయనమైన స్టెల్లా షిప్.. కాకినాడ నుంచి వెళ్లేందుకు ..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెట్ అర్హతతో రైల్వేలో 1036 ఉద్యోగాలు
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
నెట్టింట గ్లామర్ ఫోజులతో వెర్రెక్కిస్తోన్న రణం హీరోయిన్..
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
ప్రధాని మోదీతో సత్య నాదెళ్ల కీలక భేటి.. ఏఐ ఫస్ట్‌గా భారత్‌
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
త్వరలో లక్ష మంది కూర్చునే స్టేడియం..! సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..