Raashi Khanna: రాశిఖన్నాకు అదిరిపోయే ఆఫర్.. పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ..

ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ.

Raashi Khanna: రాశిఖన్నాకు అదిరిపోయే ఆఫర్.. పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బబ్లీ బ్యూటీ..
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2021 | 3:10 PM

Raashi Khanna:

ఊహలు గుసగుసలాడే సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ రాశిఖన్నా. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ భామ. ఊహలు గుసగుసలాడే సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో రాశీఖన్నాకు తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించింది ఈ వయ్యారి. జిల్, బెంగాల్ టైగర్, జైలవకుశ, రీసెంట్ గా వచ్చిన ప్రతిరోజు పండగే వంటి సినిమాలతో మంచి గుర్తిపు తెచ్చుకుంది రాశి.  ఎన్టీఆర్ జైలవకుశ తప్ప మిగిలిన సినిమాలన్నీ మీడియం రేంజ్ హీరోలతోనే చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక హిందీ వెబ్ సిరీస్ లోను ఈ సుందరి బిజీగానే ఉంది.అయితే ఇప్పుడు ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.. రెబల్ స్టార్ ప్రభాస్

ప్రభాస్ ప్రస్తుత్తం వరుసగా భారీ సినిమాలను కమిట్ అయి ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాలన్నీ ఒకదానివెంట ఒకటి షూటింగ్ ను మొదలు పెట్టాయి. వీటిలో ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తరవాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ తో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు ఇలా వరుస సినిమాలు చేస్తున్న ప్రభాస్ ఆతర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇది సైన్స్ ఫిక్షన్ మూవీ .. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా నిర్మితం కానుంది. కీలకమైన పాత్రల కోసం వివిధ భాషల నుంచి నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆల్రెడీ అమితాబ్ .. దీపికా పదుకొనే  పేర్లు ఖాయమైపోయాయి. ఇప్పుడు ఈ సినిమాలో కీళక పాత్రలో రాశిఖన్నా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ  విషయంలో క్లారిటీ రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

పేదల కోసం ఇప్పటి వరుకు 14 లక్షల రూపాయాలు ఖర్చుపెట్టా..సోహెల్ ఎమోషనల్ వర్డ్స్: Syed Sohel video.

Sonusood: తెలంగాణ యువకుడి సాహసం.. సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చలించిపోయిన రియల్ హీరో…

Devi Praises Chiru: 2 అక్షరాల సీఎం 2 కాళ్ళ కుర్చీ కంటే.. 4 అక్షరాల మెగాస్టార్ అనే సింహాసనం ఎక్కువ అంటున్న డైరెక్టర్ దేవి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే