Devi Praises Chiru: 2 అక్షరాల సీఎం 2 కాళ్ళ కుర్చీ కంటే.. 4 అక్షరాల మెగాస్టార్ అనే సింహాసనం ఎక్కువ అంటున్న డైరెక్టర్ దేవి
Devi Prasad Praises Chiru: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న హీరో. స్వయం కృషితో హిమాలయాలంత ఎత్తుకు...
Devi Prasad Praises Chiru: మెగాస్టార్ చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న హీరో. స్వయం కృషితో హిమాలయాలంత ఎత్తుకు ఎదిగిన చిరంజీవిని రాజకీయ పరంగా విబేధించేవారు ఉంటారేమో కానీ.. వ్యక్తిగతంగా అభిమానించేవారు ఎక్కువ. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో నేను ఉన్నాను అంటూ ముందుకొచ్చి ఆదుకునే వ్యక్తి చిరు. కరోనా నేపథ్యంలో సినీ పరిశ్రమలోని కార్మికులకు అండగా నిలిచారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టారు.. తాజాగా కరోనా బాధితుల కోసం ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు దేవి ప్రసాద్ చిరంజీవి ని ప్రసంశలతో ముంచెత్తారు. తాజాగా చిరింజీవి సేవా గుణం గురించి సోషల్ మీడియాలో అద్బుతంగా రాశారు.
ఓ మనిషికి మరో మనిషి నుండి దానాన్నో, దాతృత్వాన్నో తమ హక్కు గా ఆశించే హక్కులేదు. దానికి కొలతలు వేసే హక్కు అసలే లేదు. అది ఇచ్చేవారి హృదయవైశాల్యానికీ, పుచ్చుకొనేవారి కృతజ్ఞతాభావానికి సంబంధించిన విషయం మాత్రమేనని అన్నారు దేవి ప్రసాద్. అంతేకాదు సమాజం కుల,మత,ప్రాంత,పార్టీలుగా విడిపోయివున్నప్పుడు ఏ మనిషి ఎంత మంచి చేసినా విమర్శించేవారు వుంటూనేవుంటారు. ప్రశంస పాక్షికంగానే వుంటుంది. విమర్శకంటే సత్సంకల్పం ఎప్పుడూ వేలమెట్లు పైనే వుంటుందని విజ్ఞులందరికీ తెలుసు .
విపత్కర పరిస్థితుల్లో తెలుగు సినీపరిశ్రమలో తోటివారిని కలుపుకుని ఓ పెద్దన్నయ్యలా బాధ్యతను తీసుకొని ఆపన్నులకు అద్భుతసాయాన్ని అందిస్తున్న చిరంజీవి గారిని చిత్రపరిశ్రమ ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటుంది. అవసరమైన సమయంలో ఆక్సిజెన్ అందించి ప్రాణాలు నిలుపుతున్నందుకు తెలుగుప్రజల మనసుల్లో ఆయన ధన్యజీవి గా నిలిచిపోతారని చెప్పారు. అంతేకాదు “సి.ఎం.”అనే పదవికంటే “చిరంజీవి” అనే పదవి గొప్పది అని ఎవరో అన్నట్లు.. అచ్చంగా నా అభిప్రాయమూ అదేనన్నారు దేవీప్రసాద్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు.
రెండక్షరాల “సి.ఎం” అనే రెండుకాళ్ళ కుర్చీకంటే, నాలుగక్షరాల “మెగాస్టార్” అనే నాలుగుకాళ్ళ సింహాసనం ఎప్పటికీ పదిలం. రాజకీయపుటెత్తులు పై ఎత్తులు పొత్తులతాకిడి కి ఆ కుర్చీ ఎప్పుడైనా కూలిపోవచ్చు. తరగని అభిమానంతో ప్రేక్షకాభిమానులు వారి హృదయాలలో ప్రతిష్టించుకున్న ఈ సింహాసనం ఎప్పటికీ చెక్కుచెదరదు. దానిపై ఆశీనులైవున్న చిరంజీవిగారు వర్ధిల్లుతూనేవుంటారని చెప్పారు దేవి ప్రసాద్.
ఇక దేవి ప్రసాద్ ఆడుతూ పాడుతూ’, ‘లీలామహల్ సెంటర్’, ‘బ్లేడ్ బాబ్జీ’, ‘కెవ్వుకేక’ వంటి చిత్రాలను దర్శకత్వం వహించారు. అంతేకాదు తన చిత్రాల్లో అతిధిగా కనిపిస్తూ సందడి చేస్తారు. ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో గుమ్మడి పాత్ర పోషించిన దేవి ప్రసాద్ తాజాగా ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘రాజ్‌దూత్’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘విరాట పర్వం’తోపాటు అనేక సినిమాల్లో నటిస్తున్నారు.
Also Read:
.