Actress Meena: సీనియ‌ర్ న‌టి మీనా ఖాతాలో రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్.. నెవ్వ‌ర్ బిఫోర్

40 ఏళ్ల కెరీర్లో నాలుగైదు భాషల్లో వందలాది సినిమాలు చేశారు మీనా. కానీ.. ఇది కదా నేను కోరుకుంది అనేంత అరుదైన అవకాశం ఆమెకు ఇప్పుడే దక్కబోతోంది....

Actress Meena: సీనియ‌ర్ న‌టి  మీనా ఖాతాలో రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్.. నెవ్వ‌ర్ బిఫోర్
meena-.
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 11, 2021 | 3:24 PM

40 ఏళ్ల కెరీర్లో నాలుగైదు భాషల్లో వందలాది సినిమాలు చేశారు మీనా. కానీ.. ఇది కదా నేను కోరుకుంది అనేంత అరుదైన అవకాశం ఆమెకు ఇప్పుడే దక్కబోతోంది. టోటల్ ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవ్వరికీ దొరకని ఆ క్రెడిట్.. రేపటిరోజున మీనాకు సొంతం కాబోతోంది. ఇంతకీ ఏమిటా గొప్ప సువర్ణావకాశం? తెలుసుకుందాం పదండి. సీనియారిటీ వచ్చాక బిజీగా మారిన టాప్ హీరోయిన్ల జాబితా తీస్తే.. అందులో టాప్ మోస్ట్ ప్లేస్ లో వుంటారు మీనా. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి అన్నాత్తేలో నటిస్తున్నారు. లేటెస్ట్ గా దృశ్యం తెలుగు రీమేక్ లో విక్టరీ హీరో వెంకటేష్ కి జోడీగా జ్యోతి పాత్రను రిపీట్ చేస్తున్నారు మీనా. అంతకుమించి… మరో రేరెస్ట్ క్రెడిట్ సొంతం కాబోతోంది మీనాకు.

దృశ్యం ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో కూడా మోహన్ లాల్ పక్కన రాణీ జార్జ్ అనే హౌస్ వైఫ్ పాత్రలో నటించారు మీనా. సీక్వెల్ కూడా కంప్లీటై ఓటీటీ స్ట్రీమింగ్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది మలయాళ దృశ్యం2. పైగా సీక్వెల్ లో మీనా పాత్రకే ప్రయారిటీ ఎక్కువ. అదే రోల్ ని ఇప్పుడు తెలుగులో చేస్తున్న మీనాను.. రేపటిరోజున తమిళ్ ఛాన్స్ కూడా వెతుక్కుంటూ వస్తోంది. పాపనాశం పేరుతో రిలీజై ఘనవిజయం సాధించింది దృశ్యం తమిళ్ వెర్షన్. ఆరేళ్ళ కిందటొచ్చిన పాపనాశంలో కమల్ కి జోడీగా గౌతమి నటించారు. అప్పట్లో వాళ్ళిద్దరి మధ్య ఇంటిమేట్ సీన్లు సినిమాకు ప్లస్ అయ్యాయి.

రియల్ లైఫ్ లో కూడా సహజీవనం చేసిన కమల్ అండ్ గౌతమీ.. తర్వాత డిఫరెన్సెస్ రావడంతో విడిపోయి వేరుగా వుంటున్నారు. ఈ క్రమంలో పాపనాశం సీక్వెల్ లో గౌతమీ నటించే ఛాన్సెస్ చాలా తక్కువ. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మున‌ప‌టిలా పండదని, గౌతమికి ఆల్టర్నేటివ్ గా మీనాను తీసుకోవాలని కమల్ కోరినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ జీతూ జోసెఫ్ కూడా మీనాకే ఓటు వేసే అవకాశముంది. సో.. ఒకే సినిమా మూడు లాంగ్వేజెస్ లో ముగ్గురు సీనియర్ హీరోలతో కలిసి నటించే రేర్ అండ్ రేరెస్ట్ ఫీట్.. మీనా ఖాతాలో పడబోతోందన్న మాట.

Also Read: మరో ప్రాజెక్ట్‏కు రవితేజ గ్రీన్ సిగ్నల్ .. వచ్చే నెలలో సెట్స్ పైకి మాస్ మహారాజా న్యూమూవీ.. అప్‏డేట్ ఇచ్చిన డైరెక్టర్..

నాని టక్ జగదీష్ రిలీజ్ పై గుసగుసలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే