AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: మరో ప్రాజెక్ట్‏కు రవితేజ గ్రీన్ సిగ్నల్ .. వచ్చే నెలలో సెట్స్ పైకి మాస్ మహారాజా న్యూమూవీ.. అప్‏డేట్ ఇచ్చిన డైరెక్టర్..

Ravi Teja New Update: క్రాక్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.

Raviteja: మరో ప్రాజెక్ట్‏కు  రవితేజ గ్రీన్ సిగ్నల్ .. వచ్చే నెలలో సెట్స్ పైకి మాస్ మహారాజా న్యూమూవీ.. అప్‏డేట్ ఇచ్చిన డైరెక్టర్..
Raviteja
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2021 | 2:43 PM

Share

Ravi Teja New Update: క్రాక్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ లో వర్క్ చేయడానికి ఎదురుచూస్తున్నాడు రవితేజ. ఇక ఈ కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత షూటింగ్ లు స్టార్ట్ కాగానే.. ఖిలాడీ వర్క్ పూర్తి చేయాలని చూస్తున్నాడట. అటు ఖిలాడీ మూవీ సెట్స్ పై ఉండగానే.. రవితేజ మరో రెండు మూవీస్ ప్లాన్ చేస్తున్నాడు.

శరత్ మండవ దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రాబోయే మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగానే పెట్టుకున్నారు మాస్ మాహారాజా అభిమానులు. వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా లాక్ డౌన్ లేకపోతే.. ఇప్పటికే మొదలయ్యి ఉండేది. ఫ్యాన్స్ కూడా ఈ మూవీ అప్ డేట్స్ కోసం వేయిట్ చేస్తున్నారు. అయితే శరత్ మండవ, రవితేజ కాంబినేషన్ లో రానున్న మూవీ కోసం.. ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రెజర్ ను తట్టుకోలేకపోతున్నాడు.. డైరెక్టర్. దీంతో స్వయంగా ఆయనే రంగంలోకి దిగాడు. రవితేజతో మూవీ చేసేందుకు తాను కూడా చాలా ఆంగ్జైటీగా ఎదురుచూస్తున్నానన్న శరత్.. సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, థీమ్ సాంగ్.. ఇలా అన్నీ వేరే లెవెల్లో.. మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటాయంటూ.. ఓ ట్వీట్ చేశాడు. అసలు ఎవరూ ఊహించని రీతిలో ఉంటాయని.. ఇంతకుమించి ఇంకేమీ అప్ డేట్స్ ఇవ్వలేనని తెలిపాడు. ఇక ఈ న్యూ ప్రాజెక్ట్.. వచ్చే జూలైలో స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు డైరెక్టర్ శరత్ తెలిపాడు. గతంలో తమిళ్ లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ కో టూ మూవీ ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు శరత్. ఆ తర్వాత పలు చిత్రాలకు సినిమాటోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు.

Also Read: ఇండస్ట్రీకి రాకముందు హీరోయిన్ అనుష్క దగ్గర పీఆర్‌గా, మూడు నెలల్లో కోస్టార్‌గా.. పరిణితి చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..

Drishyam-2 Tamil Remake: దృశ్యం 2 తమిళ్ రీమేక్‏కు ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. కమల్ ‘పాపనాశం’లో గౌతమి ఉంటుందా ?