AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drishyam-2 Tamil Remake: దృశ్యం 2 తమిళ్ రీమేక్‏కు ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. కమల్ ‘పాపనాశం’లో గౌతమి ఉంటుందా ?

Kamal Haasan Drishyam 2: కమల్ హాసన్.. ప్రస్తుతం సినీ కెరీర్ అస్సలు బాగున్నట్లుగా కనిపించడం లేదు. ఏ మూవీ స్టార్ట్ చేసిన తలనొప్పులు మాత్రం తగ్గడం లేదు.

Drishyam-2 Tamil Remake: దృశ్యం 2 తమిళ్ రీమేక్‏కు ప్లాన్ చేస్తున్న డైరెక్టర్.. కమల్ 'పాపనాశం'లో గౌతమి ఉంటుందా ?
Drishyam 2
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2021 | 1:03 PM

Share

Kamal Haasan Drishyam 2: కమల్ హాసన్.. ప్రస్తుతం సినీ కెరీర్ అస్సలు బాగున్నట్లుగా కనిపించడం లేదు. ఏ మూవీ స్టార్ట్ చేసిన తలనొప్పులు మాత్రం తగ్గడం లేదు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఇండియన్ 2. ఈ మూవీకి వరుసగా కష్టాలే ఎదురవుతున్నాయి. షూటింగ్ టైమ్ లో అగ్ని ప్రమాదం జరగడం.. ఆ తర్వాత డైరెక్టర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ మద్య వివాదం, కోర్టు గొడవలు, కొలిక్కిరానిచర్చలు.. ఇలా ఇండియన్ సీక్వెల్ కథ సాగుతూనే ఉంది.

అయితే తమిళనాడు ఎన్నికలు ముగిశాక కమల్.. శంకర్, లైకా ప్రొడక్షన్ సంస్థ మధ్య వివాదంను తొలగించేందుకు ప్రయత్నించాడు. అలా వారం పది రోజులు గడిచిందో లేదో.. వారిద్ధరిని కలపడం ఇక తనవల్ల కాదని చేతులెత్తేశాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆకస్మాత్తుగా వివాదం నుంచి పక్కకు తప్పుకున్నాడు.

ఇదిలా ఉంటే.. కమల్ గతంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన దృశ్యం మూవీని తమిళ్ లో పాపనాశం టైటిల్ రీమేక్ చేసి గతంలో హిట్ కొట్టాడు. ఈ సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు దృశ్యం 2 సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. ఇందుకు కమల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన మలయాళం దృశ్యం టూ మూవీ, తెలుగులో కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పుడు ‘పాపనాశం’ మూవీ సీక్వెల్ లో మరో చిక్కు వచ్చిపడింది. దృశ్యంలో కమల్ భార్యగా గౌతమి నటించగా.. సీక్వెల్ లో ఆమె నటిస్తుందా లేదా అన్న చర్చ మొదలైంంది. గత కొన్నెళ్లుగా స్నేహంగా ఉన్న వీరు కమల్‌–గౌతమి ఆ మధ్య విడిపోయారు. తమ మధ్య ఉన్న బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో సీక్వెల్ లో కమల్ భార్యగా గౌతమి నటిస్తుందా..? లేక వేరే హీరోయిన్ ను తీసుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: Anjeer Benefits: రోజూ ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే సులభంగా బరువు తగ్గుతారు.. డయబెటీస్ రోగులకు ఎన్నో ప్రయోజనాలు..

AP CM Jagan: ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ టూర్.. విజయవాడకు తిరుగు పయనం.. రెండు రోజుల్లో ఆరుగురు మంత్రులతో భేటీ!