AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

R. Madhavan : పైరసీలో సినిమా చూసి ట్వీట్ చేసిన వ్యక్తి.. మాధవన్ ఎలా స్పందించాడంటే..

పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని వదలడం లేదు. సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే సినిమా పైరసీ అవుతుంది. దాంతో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూడకుండా అవుతోంది.

R. Madhavan : పైరసీలో సినిమా చూసి ట్వీట్ చేసిన వ్యక్తి.. మాధవన్ ఎలా స్పందించాడంటే..
R. Madhavan
Rajeev Rayala
|

Updated on: Jul 12, 2022 | 7:40 AM

Share

పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని వదలడం లేదు. సినిమా రిలీజ్ అయిన రోజు సాయంత్రానికే సినిమా పైరసీ అవుతుంది. దాంతో వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలను ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్లి చూడకుండా అవుతోంది. తాజాగా ఓ వ్యక్తి పైరసీలో సినిమాను చూసి సినిమాబాగుందని , క్లామాక్స్ మళ్లీ మళ్లీ చూశానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా సదురు హీరోను కూడా ట్యాగ్ చేశాడు. దాంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. విషయం ఏంటంటే హీరో మాధవన్(R Madhavan) నటించిన లేటెస్ట్ మూవీ ‘రాకెట్రీ’ (Rocketry)ఇటీవలే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది కూడా.. అయితే ఈ సినిమాను కొందరు పైరసీ చేసి పలు వెబ్ సైట్స్ లో ఉంచారు. పైరసీలో సినిమా చూసిన ఓ వ్యక్తి..

మాధవన్ నటన పై ప్రశంసలు కురిపించాడు. అలాగే దర్శకుడిగా మొదటి సినిమా అయినా కూడా అదరగొట్టేశారు అన్నాడు.  సినిమా లో క్లైమాక్స్ నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ సీన్స్ ను మళ్లీ మళ్లీ చూశాను.. అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ట్వీట్ చేశారు. దీనిపై హీరో మాధవన్ స్పందించాడు. క్లైమాక్స్ సన్నివేశాలను మీరు మళ్లీ మళ్లీ ఎలా చూడగలిగారు.? అని ప్రశ్నించాడు. దానికి చాలా మంది పైరసీలో చూసి ఉంటాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌  జీవితాధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ’ .  ఆర్‌. మాధవన్‌ తొలిసారిగా దర్శకుడిగా మారి ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. సీనియర్‌ నటీమణి సిమ్రన్‌ కీలక పాత్రలో నటించింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో షారుఖ్‌, సూర్య కీలకపాత్రల్లో కనిపించారు.

Madhavan

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
నోటిగా కారంగా, ఎంతో రుచిగా.. ఇలా చేస్తే కారప్పొడి రుచి అదుర్స్
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
3M యంగ్ సైంటిస్ట్‌గా ఎదిగిన 7వ తరగతి బాలిక.. పిట్ట కొంచెం కూత గనం
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
తెలంగాణలో ఆ రోజు నుంచే కొత్త పింఛన్లు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
మేక కాళ్ల సూప్.. ఆషాఢంలో తింటే ఆ రోగం మాయమే
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
10th క్లాస్ తర్వాత సినిమాలు ఎందుకు చేయడం లేదంటే..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్