AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun Family: ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తోన్న అల్లు అర్జున్.. నెట్టింట హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..

Allu Arjun Family Photos Viral: కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే సెలబ్రిటీల్లో మెగా హీరో అల్లు అర్జున్‌ ఒకరు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు కుటుంబంతో సరాదాగా...

Allu Arjun Family: ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తోన్న అల్లు అర్జున్.. నెట్టింట హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..
Allu Arjun Family
Narender Vaitla
|

Updated on: Apr 04, 2021 | 7:30 PM

Share

Allu Arjun Family Photos Viral: కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే సెలబ్రిటీల్లో మెగా హీరో అల్లు అర్జున్‌ ఒకరు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త ఖాళీ సమయం దొరికిందంటే చాలు కుటుంబంతో సరాదాగా గడుపుతుంటాడు బన్నీ. ఇక భార్య, కుమారుడు, కూతురుతో కలిసి గడిపిన సంతోష క్షణాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకోవడం బన్నీకి అలవాటు. కేవలం బన్నీనే కాకుండా ఆయన భార్య స్నేహారెడ్డి కూడా నెట్టింట ఫ్యామిలీ ఫొటోలు పోస్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ‘పుష్ఫ’ సినిమా షూటింగ్‌ నుంచి దొరికిన ఖాళీ సమయాన్ని బన్నీ కుటుంబంతో గడుపుతున్నాడు. తాజాగా బన్నీ తన తనయుడు అయాన్‌ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లాడు. ఈ క్రమంలోనే కుమారుడితో కేక్‌ కట్‌ చేపిస్తుండగా తీసిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా మాల్దీవుల్లో సముద్ర తీరాన ప్రకృతి రమణీయత నడుమ ఎంజాయ్‌ చేస్తోన్న సమయంలో దిగిన కొన్ని ఫొటోలను బన్నీతో పాటు ఆయన సతీమణి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా నీటి కాలుష్యం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

స్నేహ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు..

అల్లు అర్జున్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఫొటోలు..

Also Read: Vakeel Saab pre release event live: ‘వకీల్ సాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్.. హోరెత్తుతున్న శిల్పకళావేదిక

Ram Charan: రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ క్రేజీ అప్‏డేట్.. మరోసారి మెగా కాంబో రిపీట్ కాబోతుందా ?

మరోసారి సింగర్‏గా మారనున్న పవన్ కళ్యాణ్.. అసలు విషయం చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్.. ఇంతకీ ఏ మూవీలో అంటే..