Allu Arjun: పుష్ప అరెస్ట్-విడుదల.. గడియ గడియకు ఓ ట్విస్ట్.. క్షణక్షణం ఉత్కంఠ
పుష్ప అరెస్ట్-విడుదల.. ఆ రెంటి నడుమ 24 గంటలు. గడియ గడియకు ఓ ట్విస్ట్.. క్షణక్షణం ఉత్కంఠ. ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదలయ్యారు. 24 ఫ్రేమ్స్‌లో ఎమోషన్స్‌తో పాటు కీలక ఎక్స్ ప్రెషన్స్ తెరపైకి వచ్చాయి.
శుక్రవారం అరెస్ట్.. సాయంత్రం జైలు.. శనివారం వేకువజామునే విడుదల. ఇదీ.. అల్లు అర్జున్ అరెస్ట్, సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 24గంటల్లో జరిగిన పరిణామాలు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలై ఇంట్లోకి వస్తూనే భావోద్వేగానికి లోనయ్యారు అల్లు అర్జున్. కొడుకు అయాన్, భార్య స్నేహారెడ్డిని చూసి ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సభ్యులందర్నీ హత్తుకున్నారు. మేనత్త, చిరంజీవి సతీమణి సురేఖ బన్నీని దగ్గరకు తీసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. దిష్టితీసి ఇంట్లోకి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. సంధ్య థియేటర్‌కు 20ఏళ్లుగా వెళ్తున్నా.. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు అల్లు అర్జున్. తనకు తెలియకుండా జరిగిన దానికి మరోసారి సారీ చెప్పి.. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
ఉదయం నుంచి అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు అల్లు ఇంటికి క్యూ కట్టారు. పుష్ప టీమ్‌తో పాటు విజయ్ దేవరకొండ, రానా, శ్రీకాంత్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి పలకరించారు. రాజకీయ నేతలు గంటా, అవంతి అల్లు అర్జున్‌ని పరామర్శించారు. సురేష్ బాబు, నాగచైతన్య, నారాయణమూర్తి, దిల్ రాజు, రామ్‌తో పాటు చాలామంది సినీ ప్రముఖులు అల్లు అర్జున్ పలకరించారు.
అల్లు అర్జున్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. అరెస్ట్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ప్రభాస్, వెంకటేష్ కూడా అల్లు అర్జున్‌కు ఫోన్లు చేసి పరామర్శించారు. ప్రస్తుతం ముంబైలో వార్-2 షూట్‌లో జూనియర్ ఎన్టీఆర్… అల్లు అర్జున్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే కలుస్తానని తెలిపారు.
అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమన్నారు ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్.. కేసు కోర్టులో పరిధిలో ఉన్నందున ఎక్కువ మాట్లాడలేమన్నారు. కావాలనే అరెస్ట్ చేసి.. బన్నీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు రచయిత చిన్ని కృష్ణ.
మరోవైపు అల్లు అర్జున్‌ను రాత్రంతా జైలులో ఉంచడం హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమేనన్నారు అడ్వొకేట్ అశోక్ రెడ్డి. ఈ అంశంపై లీగల్‌గా ప్రొసీడవుతామన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ రాజకీయంగానూ రచ్చ రేపింది. కావాలనే ఉద్దేశపూర్వంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటున్నాయి బీజేపీ, బీఆర్‌ఎస్. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అల్లు అర్జున్‌పై తమకెలాంటి కక్ష లేదన్నారు పీసీసీ చీఫ్
మొత్తానికి ఐకాన్ స్టార్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సెన్సేషన్ కాగా.. ఆ వెంటనే బెయిల్, విడుదలతో ఫ్యాన్స్, సినీ ప్రముఖులు హ్యాపీ ఫీలయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.